Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప‌వ‌న్ పాలిటిక్స్ పై చిరు కామెంట్స్!

ప‌వ‌న్ పాలిటిక్స్ పై చిరు కామెంట్స్!

నేను రాజ‌కీయాల‌కు దూరం అంటూనే అప్పుడ‌ప్పుడు రాజ‌కీయల‌పై కామెంట్స్ చేయ‌డం ప‌రిపాటిగా ఉంది మోగాస్టార్ చిరంజీవికి. ఇవాళ హైద‌రాబాద్ లో త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 

తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌టం వల్ల.. ప‌వ‌న్ కు ఉప‌యోగ‌ప‌డుంద‌న్నారు. రాజ‌కీయాలు మాట్లాడ‌ను అంటూనే ప‌వ‌న్ కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చే రోజు రావాల‌న్నారు. తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నానని, ప్ర‌స్తుత నాయ‌కుల‌పై ఎలాంటి సెటైర్లు వేయ‌లేద‌న్నారు.

ప‌వ‌న్ స్ధాయిని ప్ర‌జ‌లే నిర్ణయిస్తారని. నా త‌మ్ముడి ప‌వ‌న్ కు భ‌విష్య‌త్ లో మ‌ద్ద‌తు ఇస్తానేమో అంటూ సంచాల‌న కామోంట్లు చేశారు. చిరు కామోంట్ల వెనుక ఏదైనా రాజ‌కీయ ఉద్దేశం ఉందంటూన్నారు జ‌న‌సేన నేత‌లు. అప్ప‌ట్లో జ‌న‌సేన నెం.2 గా ఉన్న మ‌నోహ‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిరంజీవి జ‌న‌సేన త‌రుపున ప్ర‌చారం చేస్తారు అని అన్న మాట‌ల‌కు ఇప్పుడు చిరంజీవి అన్న‌ మాటలకూ ఏదో లింక్ ఉందంటూన్నారు.

ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన చిరంజీవి మళ్లీ జ‌న‌సేన‌లోకి వ‌స్తే మాత్రం ఈసారి క‌నీసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయిన గెలవచ్చంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?