Advertisement

Advertisement


Home > Politics - Gossip

కళాబంధు అంత కష్టాల్లో వున్నారా?

కళాబంధు అంత కష్టాల్లో వున్నారా?

ఓడలు బండ్లు కావడం.. బండ్లు ఓడలు కావడం మామూలే. దాన్నే మనవాళ్లు విధి అంటారు.. డెస్టినీ అంటారు. మహాకవి శ్రీశ్రీ ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే’ అంటూ ఈ రెండు స్థితులను వర్ణించాడు. 

కళాబంధు సుబ్బిరామిరెడ్డి అంటే ఓ వైభోగం. రాజకీయంగా ఢిల్లీలో అపరిమితమైన పలుకుబడి. శివభక్తుడిగా పేరు. ముంబాయిలో పార్టీ ఇస్తే హాజరు కానీ బాలీవుడ్ సెలబ్రిటీ వుండడు. విశాఖలో తన గెస్ట్ హవుస్ కు వెళ్తే, జనాల తిరునాళ్లే. విశాఖ ఎన్నికల్లో పోటీ చేసినపుడు జనాలకు డబ్బుల పంపిణీ జాతరే. ఎక్కడ ఫంక్షన్ చేసినా పలువురు సినిమా నటులు క్యూ కట్టి హాజరు కావాల్సిందే.

ఇదంతా గతం.

ఇప్పుడు కళాబంధు చాలా కష్టాల్లో వున్నారని టాలీవుడ్ లో రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఆయన సంస్థలు బ్యాంకులకు బకాయి పడడం, వాటి కోసం ఆస్తులు అన్నీ సీజ్ చేయడం, దివాలా పిటిషన్ వంటి కార్యక్రమాలేవో జరుగుతున్నాయన్న వార్తలు అన్నీ కలిసి మొత్తం మీద టీఎస్సార్ పరిస్థితి మీద రకరకాల గ్యాసిప్ లకు దారి తీసున్నాయి.

ఒకప్పుడు ఏ నిర్మాతకు ఏ రాత్రి వేళ విడుదల టైమ్ లో కష్టం వచ్చినా సుబ్బిరామిరెడ్డి తలుపు తట్టేవారు. టక్కున కోట్లు తీసి ఇచ్చి ఆదుకున్న సందర్భాలు అనేకం. ఎఎన్నార్, మోహన్ బాబు, నాగార్జున ఇలా ఇండస్ట్రీలో ఆప్తులు ఎందరో? కానీ ఇప్పుడు అయిదు లక్షలు, పది లక్షలు ట్రాన్షాక్షన్ కు సైతం టీఎస్సార్ ఇబ్బంది పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తులు అనేకం వున్నాయి. కానీ అవన్నీ వివిధ రకాలుగా సీజ్ లో వున్నాయని వినిపిస్తోంది. అందువల్ల ఒకప్పుడు ఆయన సాయం కోరిన వాళ్లనే ఇప్పుడు రివర్స్ లో టీఎస్సార్ నే సాయం కోరుతున్నారని టాక్.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. వుండి వుంటే టీఎస్సార్ పరిస్థితి ఇలా వుండేది కాదు. సోనియా గాంధీతో నేరుగా వెళ్లి మాట్లాడగల పలుకుబడి ఆయన స్వంతం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏవీ ఆయనకు అనుకూలంగా లేవు అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం టీఎస్సార్ వయసు 79 ఏళ్లు. అయినా మంచి ఫిట్ గా కనిపిస్తారు. నిత్యం గంటల కొద్దీ సమయం శివపూజలో గడుపుతారు. ఏటా విశాఖలో భారీ ఖర్చుతో మహా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం వల్ల ఉత్తరాంధ్రలో టీఎస్సార్ పేరు ప్రతి ఇంటా తెలుసు.

టీఎస్సార్ సోదరుడి పిల్లలు అయిన డెక్కన్ క్రానికల్ అధినేతలు ఇలాగే ఎత్తుకు ఎదిగి పల్లానికి జారిపోయారు. ఇప్పుడు టీఎస్సార్ పరిస్థితి ఇలా వుంది. తెలుగులో కళాబంధు చాలా సినిమాలు నిర్మించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?