Advertisement

Advertisement


Home > Politics - Gossip

కలియుగ ధర్మరాజు...చంద్రబాబు

కలియుగ ధర్మరాజు...చంద్రబాబు

ధర్మరాజు అండ్ కో అలా నడుచుకుంటూ వెళ్లిపోయారట మహా భారతం చివరి ఘట్టంలో. దారిలో ఒక్కొక్కరు నేల రాలిపోయారట. కానీ ధర్మరాజు కనీసం వెనక్కుతిరిగి చూడకుండా ముందుకు సాగాడట. ఇక్కడ పెర్ ఫెక్ట్ పోలిక అని చెప్పడం లేదు కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యవహారం అలాగే వుంది. ప్రతిపక్ష నేతగా ఆయన అలా ముందుకు సాగిపోతున్నారు. సారీ సాగడం లేదు. కరోనా కారణంగా ఇంట్లోనే వుంటున్నారు. 

కానీ ఆయనతో అయిదేళ్లు అధికార ప్రయాణం సాగించిన వారు ఒక్కొక్కరుగా సైలంట్ అయిపోతున్నారు. కానీ బాబుకు పట్టినట్లే కనిపించడం లేదు. జేసి ప్రభాకర రెడ్డి జైలు పాలయ్యారు. ఇప్పటి వరకు బెయిల్ లేదు. ఆయన పాపం జిల్లా జైలులో వున్నారు. అచ్చెంనాయుడు వ్యవహారం కాస్త బెటర్. కాస్త మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో వున్నారు. కానీ ఆయనకూ బెయిలు లేదు. అది వచ్చేవరకు పలుకూ వుండదు.

కొల్లు రవీంద్ర కూడా బెయిల్ కోసం వెయిటింగ్. వీరందికన్నా ముందు చింతమనేని ప్రభాకర్ ఇలాగే బెయిల్ అప్లికేషన్లు పెట్టి, పెట్టి, ఆఖరికి బయటకు చవ్చారు. ఆయనా కాస్త సైలంట్ నే ఇఫ్పుడు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు గొంతులు అన్నీ దాదాపు మూత పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ మొత్తానికి అయ్యన్నపాత్రుడు కాస్త గొంతెత్తుతున్నారు. కొన్ని చానెళ్లకు వరంలా కనిపించే సబ్బం హరి గొంత మామూలే.

ఈస్ట్, వెస్ట్ మొత్తానికి అప్పుడప్పుడు యనమల మాట మాత్రం వినిపిస్తుంది. అది కూడా దాదాపు తగ్గింది. రాయలసీమలో నో వాయిస్..నో సౌండ్. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో గొంతు పెట్టుకుని పడిపోయే నాయకుల సంఖ్య మెలమెల్లగా తగ్గుతోంది. ఇవన్నీ చూస్తూ అలా ధర్మరాజులా మౌనంగా సాగిపోతున్నారు చంద్రబాబు. ఈ నాయకులను నమ్ముకోవడం కన్నా, కోర్టులను నమ్ముకోవడం బెటర్ అనుకుంటూ.

చంద్రబాబు స్వయంకృతాపరాధం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?