విశాఖ రాజధాని ఇష్టమే కానీ …?

కానీలూ.. కంగాళీలే రాజకీయాల్లో చాలా కధలు నడిపేస్తాయి. సూటిగా సుత్తికొట్టకుండా చెప్పాలంటే తమ ఏరియాకు రాజధాని వస్తే ఎవరికైనా సంతోషమే కదా. కానీ తమ్ముళ్ళు అది చెప్పడానికి మొహమాటపడుతున్నారో ఏమో. Advertisement మాజీ మంత్రి…

కానీలూ.. కంగాళీలే రాజకీయాల్లో చాలా కధలు నడిపేస్తాయి. సూటిగా సుత్తికొట్టకుండా చెప్పాలంటే తమ ఏరియాకు రాజధాని వస్తే ఎవరికైనా సంతోషమే కదా. కానీ తమ్ముళ్ళు అది చెప్పడానికి మొహమాటపడుతున్నారో ఏమో.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా తాను విశాఖ వాసిగా రాజధానిని స్వాగతిస్తున్నాను అంటూనే కానీ అని పెద్ద  మెలిక పెడుతున్నారు. అదేంటి అంటే కడప, చిత్తూరు జిల్లాల వారికి విశాఖ‌ రాజధాని  అయితే బాగా దూరం అవుతుందిట. అది జగన్ ఆలోచించారా అంటున్నారు.

అలాగే కర్నూల్లో హైకోర్టు పెడితే శ్రీకాకుళం జిల్లా వారు ఎలా వెళ్లగలరని లాజిక్ పాయింట్లు తీస్తున్నారు. తాను శ్రీకాకుళంలో హైకోర్టు పెట్టమని డిమాండ్ చేస్తానని, దాన్ని అక్కడ  పెడతారా అంటూ కొత్త నినాదాలను  ముందుకు తెస్తున్నారు.

అమరావతి రాజధాని అందరికీ అనుకూలమని చంద్రబాబు పాటనే చివరికి అయ్యన్నపాత్రుడు కూడా పాడుతున్నారు. ఆనాడు రాజధాని అమరావతి అంటే జగన్ సహా అంతా సమర్ధించారని, ఇపుడు గెలిచాకా యూటర్న్ తీసుకోవడమేంటని తనలోని పాత అయ్యన్న అలాగే ఉన్నాడంటూ చెప్పేలా  హాట్ కామెంట్స్ చేసేశారు.

మొత్తానికి అయ్యన్న విశాఖ రాజధానిని సమర్ధిస్తున్నారో, అమరావతిని సమర్ధిస్తున్నారో తెలియనంతగా అయోమయం రాజకీయానికి తెరతీశారు. చివరాఖరుకు చంద్రబాబు అమరావతే తమకు కావాల్సిందంటూ ముక్తాయింపూ ఇచ్చారు. ఏది ఏమైనా అయ్యన్న తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తూంటే తమ్ముళకు విశాఖ రాజధాని అన్నది గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితి,  అలాగని పార్టీ లైన్ని దాటలేని స్థితి  అన్నట్లుగా సీన్ ఉందని అంటున్నారు.

మరి అయ్యన్న దారిలో మిగిలిన తమ్ముళ్ళు  మరెంతమంది రాయలసీమ పేరిట సానుభూతి కురిపిస్తూ ఇండైరెక్ట్ గా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తారో చూడాలి.

చంద్రబాబు స్వయంకృతాపరాధం