Advertisement

Advertisement


Home > Politics - Gossip

కసరత్తు ముఖప్రీతికే.. కవితకు పక్కా!

కసరత్తు ముఖప్రీతికే.. కవితకు పక్కా!

ఏపీలో రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కబోతున్నాయో ఖరారైపోయింది. తెలంగాణలో ఇంకా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. ఈ రెండూ కూడా అధికార తెరాస పరం కానున్నాయి. వీటిలో ఒక స్థానం మాత్రం కేసీఆర్ కుమార్తె కవితకు కేటాయించే అవకాశం పుష్కలంగా ఉందని తెలుస్తోంది.

తెలంగాణకు ఈసారి రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే తెరాసకు చెందిన కే కేశవరావు ప్రస్తుతం పదవీకాలం పూర్తవుతున్న ఎంపీల్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ కోటాలో ఉన్నారు. ఆయనకు పార్టీతో ఉన్న అనుబంధం, కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. ఆయనకు పదవిని కొనసాగించడానికి కేసీఆర్ నిర్ణయించారు. రెండుస్థానాల్లో కేకే రూపంలో ఒకటి తేలిపోయినట్టే.

మిగిలిన ఒక్క ఎంపీ స్థానం విషయంలోనే పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఆశావహులు అనేకమంది ఉన్నారు. అందువల్లనే కేసీఆర్ కు కసరత్తుకు ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణం కేసీఆర్ నిర్ణయాలు పెద్దగా కసరత్తు అవసరం లేకుండా ఏకపక్షంగా ఉంటాయి. వాటిని ప్రశ్నించేవారు.. ఎవ్వరూ ఉండరు. కానీ.. ఈ దఫా రాజ్యసభకు ఒకరికే వెసులుబాటు ఉండగా.. ఆశావహులు ఎక్కువైనందువల్ల ఇబ్బంది అవుతోంది.

ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు  బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులంతా టికెట్ ఆశిస్తున్నారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓడిపోయిన.. అప్పటి సిటింగ్ ఎంపీ.. కేసీఆర్ కుమార్తె కవిత కూడా రాజ్యసభ ఎంపీ పదవిని ఆశిస్తున్నారు. పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి కవితకు టికెట్ గ్యారంటీనే ! కేసీఆర్ చేస్తున్న కసరత్తు యావత్తూ.. ఆశావహులైన ఇతర నాయకులకు సర్దిచెప్పడానికి మాత్రమే అనే ప్రచారం కూడా జరుగుతోంది. 2014లో కేసీఆర్ కుటుంబం నుంచి కూతురు, కొడుకు, అల్లుడు పెద్దపదవులు అధిష్టించారు. 2019 ఎన్నికల్లో కూతురిని ప్రజలు ఓడించారు గానీ.. కేసీఆర్ రాజ్యసభ మార్గంలో పార్లమెంటుకు పంపదలచుకున్నట్టు కనిపిస్తోంది.

టీడీపీ మళ్ళీ నందమూరి చేతుల్లోకేనా..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?