Advertisement

Advertisement


Home > Politics - Gossip

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ అంతటి వాడు.. స్వయంగా వచ్చి.. ఒక ఆబ్లిగేషన్ అడిగితే.. దానిని మన్నించాడు. రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిలో కీలకంగా నిలవడం .. ఇత్యాది హామీలు పుచ్చుకుని.. ఆయనకు సన్నిహితుడైన పరిమల్ నత్వానీకి జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారు. అయితే కేవలం మాట నిలబెట్టుకోవడం మాత్రమే కాకుండా, ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునే టికెట్ ఇచ్చే తమ పార్టీ గౌరవం కూడా జగన్ నిలబెట్టుకున్నారు.

పరిమల్ నత్వానీ.. ముఖేష్ అంబానీ గ్రూపులో చాలా కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. ఆయన ఇప్పటికే రెండు పర్యాయాలుగా రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మొదటిసారిగా జార్ఖండ్ నుంచి ఆయన ఇండిపెండెంటుగా ఎంపీ బరిలోకి దిగి గెలిచారు. తర్వాత రెండోసారి కూడా అక్కడినుంచే మళ్లీ ఇండిపెండెంటుగానే ఎన్నికయ్యారు. స్థానికంగా బలం ఉన్న రాజకీయ పార్టీల మద్దతు తీసుకున్నప్పటికీ.. ఆ పార్టీల ముద్ర మాత్రం పడకుండా నత్వానీ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే జగన్ వద్ద మాత్రం అలాంటి పాచిక పారలేదు.

ఇప్పుడు ఖాళీ అవుతున్న సీట్లలో పరిమల్ నత్వానీ పేరు కూడా ఉంది. దాంతో ఆయన మూడో పర్యాయం ఎంపీగా ఎన్నిక కావడానికి జగన్ ను ఆశ్రయించారు. ముఖేష్ అంబానీతో వచ్చి కలిసినప్పుడే.. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించకుండానే... బయటి వారికి తమ పార్టీ తరఫున ఎంపీ టికెట్ ఇచ్చే అలవాటు తమ పార్టీలో లేదని తెగేసి చెప్పారు.

దాంతో మూడోసారి కూడా పార్టీల ముద్ర లేకుండా ఇండిపెండెంటుగా గెలవాలని అనుకున్న నత్వానీ ఆలోచన దెబ్బతింది. జగన్మోహన రెడ్డి టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు గానీ.. వైకాపా తరఫున మాత్రమే ఆ టికెట్ ఇస్తానన్నారు. గతంలో చంద్రబాబునాయుడు.. మోడీ సర్కారును ప్రసన్నం చేసుకోవడానికి భాజపా వారికి ఎంపీ టికెట్లు ఇచ్చారు. కానీ సాధించిందేమీ లేదు. కానీ జగన్ అంబానీ ఆబ్లిగేషన్ వచ్చినా కూడా తమ పార్టీ నుంచే ఎంపీ టికెట్ ఇవ్వడం విశేషం. దీనివల్ల రాజ్యసభలో వైకాపా బలం 6 స్థానాలకు పెరుగుతుంది.

టీడీపీ మళ్ళీ నందమూరి చేతుల్లోకేనా..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?