Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేశినేని నాని? జంప్ జిలానీ?

కేశినేని నాని? జంప్ జిలానీ?

తెలుగుదేశం పార్టీ పరువుకు, ప్రతిష్టకు పుట్టినిల్లు లాంటి విజయవాడ పార్టీ వింగ్ లో ముసలం పుట్టింది. ఎంపీ కేశినేని నానికి, మిగిలిన పార్టీ నాయకులకు మధ్య అంతగా పొసగడం లేదు. 

కేశినేని నాని తన దారి రహదారి అన్నట్లు ఎటో వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది. గతంలో ఒక సారి ఇలాగే పార్టీ మీద అలిగారు కానీ అది అంత సీరియస్ కాలేదు. కానీ ఇప్పుడు వ్యవహారం బాగా ముదిరిపోయినట్లే వుంది.  

అతి త్వరలో నాని తెలుగుదేశం నుంచి జంప్ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఆయన భాజపా తీర్థం తీసుకుంటారని టాక్. ఈ ఉదయం ఆయన వున్నట్లుండి తన సోషల్ మీడియా ఖాతాల్లో చంద్రబాబు ఫొటో తొలగించేసారు. 

కేవలం ఆయన ఫొటో బెజవాడ ఫోటో మాత్రమే వుంచారు. అలాగే ఈ రోజు దేశం అనుకూల మీడియాలో ఓ వార్త వచ్చింది. నానికి, బుద్దా వెంకన్నకు చంద్రబాబు క్లాస్ పీకారన్నది ఆ వార్త సారాశం. దీన్ని కూడా నాని ఖండిచారు. తనకు చంద్రబాబు ఏ క్లాస్ పీకలేదని మొహమాటం లేకుండా చెప్పారు. 

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను మేయర్ చేయాలని నాని అనుకుంటున్నారని దానికి తెలుగుదేశంలో కొందరు అడ్డం పడుతున్నారని రాజకీయ వర్గాల బోగట్టా. అందుకే ఆయన భాజపా తీర్థం తీసుకుంటారని వినిపిస్తోంది. కానీ అదే సమయంలో నాని అలా వెళ్లరని, ఇలా అలిగి, యాగీ చేసి, తాను అనుకున్నది సాధించి తెలుగుదేశంలోనే వుంటారని కూడా మరో పక్క వినిపిస్తోంది.

నాని ఇప్పుడు భాజపాలోకి వెళ్తే అది తెలుగుదేశం పార్టీకి మరీ అవమానకరంగా వుంటుంది. తమదే అసలైన ప్రతిపక్షం అని నమ్మబలకడానికి తెలుగుదేశం కిందా మీదా అవుతోంది. అలాంటి నేపథ్యంలో ఓ కీలకమైన ఎంపీ వెళ్లిపోతే అంత బాగోదు. 

అందువల్ల కేశినేనిని బుజ్జగించో, ఆయనకు కావాల్సినది ఇచ్చో దగ్గర వుంచుకునే ప్రయత్నమే చేస్తుంది. లేదూ ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదు, ఎంపీగా భాజపాకు దగ్గరగా వుంటేనే బెటర్ అనుకుంటే కేశినేని నాని జంప్ జిలానీ అనేయడం ఖాయం. 

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?