పులివెందుల పంచాయ‌తీ.. ఎలా సాగింది?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆస‌క్తిదాయ‌కంగా ఉన్నాయి. ఆఖ‌రి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు,…

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆస‌క్తిదాయ‌కంగా ఉన్నాయి. ఆఖ‌రి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు, పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో పోలింగ్ జ‌రిగింది.

వీటిల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల్లో 108 పంచాయ‌తీల‌కు గానూ అన్నింటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌పోర్ట‌ర్లే విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. పులివెందుల‌పై జ‌గ‌న్ ప‌ట్టేమిటో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గ‌డం కూడా వింత కాదు. అయితే ఒక్క‌టంటే ఒక్క పంచాయ‌తీలో కూడా తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నేత బీటెక్ ర‌వి సొంతూర్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌పోర్ట‌ర్ నెగ్గాడు. ఇక ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్సీ స‌తీష్ రెడ్డి టీడీపీకి దూరం అయిన‌ట్టుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పులివెందుల్లో టీడీపీకి మ‌రీ దిక్కూదివాణం లేకపోయిన‌ట్టుగా ఉంది.

రెండు మండ‌లాల్లో పూర్తి ఏక‌గ్రీవం కావ‌డ‌మే మ‌రో విశేషం. వేంప‌ల్లి, చ‌క్రాయ‌పేట మండ‌లాల్లో అన్ని పంచాయ‌తీలూ ఏక‌గ్రీవం అయ్యాయి. ఈ మండ‌లాల్లో పోలింగే అవ‌స‌రం లేకుండా పోయింది. మండ‌లాల‌కు మండ‌లాలే ఏక‌గ్రీవం కావ‌డం విశేషం.

ఏక‌గ్రీవం అయిన పంచాయ‌తీల‌కు ప్ర‌త్యేక నిధులు కూడా అంద‌నున్నాయి. స‌త్తిరెడ్డి దూరం అయ్యాకా.. వేంప‌ల్లి మండ‌లంలో టీడీపీ మ‌రీ బ‌ల‌హీన‌ప‌డింది. ప‌ల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉన్నా, రాజ‌కీయ ఆస‌క్తులు ఉన్న వారు నామినేష‌న్ల‌ను వేసే ఉద్దేశాల‌తో ఉన్నా.. చివ‌ర‌కు రాజీ చ‌ర్చ‌ల‌తో ఈ మండ‌లాల్లో పూర్తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ అంతా ఏక‌గ్రీవం అయ్యింది.

ఇక మిగిలిన మండ‌లాల్లో ఏక‌గ్రీవాల హోరు ఉంది. స్థూలంగా 108 పంచాయ‌తీల‌కు గానూ 90 పంచాయ‌తీల వ‌ర‌కూ ఏక‌గ్రీవంగా ఎన్నిక జ‌రిగింది. మిగిలిన 18 పంచాయ‌తీల్లో టీడీపీ మ‌ద్దతుదార్లు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. వాటిల్లో ఎక్క‌డా విజ‌యం మాత్రం సాధ్యం అయిన‌ట్టుగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదార్లే అంతటా విజ‌యం సాధించ‌డంతో.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో వంద‌కు వంద‌శాతం సీట్ల‌నూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా