అమరావతి రైతులకు ఆ ఆశ కూడా పాయె!

 తెలుగుదేశం పార్టీ మండలిలో చక్రం తిప్పి అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొనే సరికి అమరావతి రైతుల్లో ఆరోజుకి కొత్త ఆశలు చిగురించాయి.  మండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ,  తెర వెనుక నుంచి నడిపిస్తున్న…

 తెలుగుదేశం పార్టీ మండలిలో చక్రం తిప్పి అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొనే సరికి అమరావతి రైతుల్లో ఆరోజుకి కొత్త ఆశలు చిగురించాయి.  మండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ,  తెర వెనుక నుంచి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడని అమరావతి ప్రాంత రైతులు ఆశ పడ్డారు.  అధికార వికేంద్రీకరణ,  ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నానికి తరలించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి ప్రాంత రైతుల  చివరి ఆశ కూడా ఇప్పుడు సన్నగిల్లి పోయే వాతావరణం ఏర్పడింది.

 శాసన మండలి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించిన తర్వాత.. అమరావతి రైతుల్లో ఒక ఆశ పుట్టింది.  ఇలాంటి సెలెక్ట్ కమిటీ ప్రతిపాదనల  వలన అమలు కాస్త ఆలస్యం అవుతుంది తప్ప, రాజధాని తరలింపు ఆగిపోయే అవకాశం లేదని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నప్పటికీ  రైతులు మాత్రం ఆశావహంగా ఆశలు పెంచుకుంటూ పోయారు. సెలెక్ట్ కమిటీ వల్ల ఏదో జరుగుతుందని వారు అనుకున్నారు.

 కానీ ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి అలాంటి కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అనడంతో నీరుగారిపోయారు.  కేవలం అది ఒక్కటే కారణం కాదు..  అసెంబ్లీ కార్యదర్శి చైర్మన్ కు రాసిన లేఖ పట్ల..  విపక్ష తెలుగుదేశం పార్టీ స్పందన కూడా వారిలో ఆశలను చంపేస్తోంది.

 సెలెక్ట్ కమిటీ ఏర్పాటు శాసనసభ కార్యదర్శి తిరస్కరించడాన్ని తెలుగుదేశం జీర్ణం చేసుకోలేక పోతుంది.  ఇలాంటి ఈ పరిణామానికి దారి తీసే నిబంధనలు కూడా ఉంటాయని వారికి ఎరుక లేకపోయింది.  ఖంగుతిన్న తెలుగుదేశం నాయకులు ఇప్పుడు న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు.  అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలపై కోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

 చంద్రబాబు కోటరీ  న్యాయ పోరాటం అనే పదం చెప్పగానే, అక్కడితో ప్రజలకు ఆశలు సన్నగిల్లి పోతున్నాయి.  చంద్రబాబు తాను ఇక ఏమీ చేయలేను అని అనిపించిన ప్రతి సందర్భంలోనూ,  న్యాయ పోరాటం చేస్తా అనే మాటలతో ప్రజలను మభ్య పెడుతూ ఉంటారు.  చరిత్రలోని ఉదాహరణలు నిరూపించిన సత్యం ఇది. మోడీ సర్కార్ తో సున్నం పెట్టుకున్న తర్వాత,  చంపేసిన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు,  చివరి దశలో ప్రజలను మభ్యపెట్టడానికి హోదా కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తా అనే పదాలను వాడారు.  ఇప్పటిదాకా ఏ న్యాయ పోరాటం చేశారో తెలియదు. ఎన్నికల్లో  ఓడిపోగానే కాడి పక్కన పారేశారు.  ఇప్పుడు అమరావతి విషయంలో తెదేపా నుంచి న్యాయ పోరాటం అనే పదం బయటకు రాగానే,  రైతుల్లో అదే భయం కలుగుతోంది.  ఈ మాటతో తెలుగుదేశం చేతులు దులిపేసుకున్నట్లే  అని వారు భావిస్తున్నారు.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు