Advertisement

Advertisement


Home > Politics - Gossip

లోకేష్ ఢిల్లీలోనా? ముంబాయి లోనా?

లోకేష్ ఢిల్లీలోనా? ముంబాయి లోనా?

తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయిన మర్నాడే ఆంధ్ర నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి అరెస్ట్ కు భయపడే ఢిల్లీలో వున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే వున్నాయి. 

బాబుగారి అను కుల సామాజిక మీడియా మాత్రం చాలా కన్వీనియెంట్ గా ఈ విషయాన్ని వదిలేసి, మిగిలినవన్నీ ప్రచురిస్తోంది. అదే ఇంకెవరైనా అయి వుంటే ఢిల్లీ లో దాగున్నారు అని వార్తలు వండి వార్చేవారు.

ఇదిలా వుంటే లోకేష్ అర్జంట్ గా ముంబాయికి మకాం మార్చారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజం అన్నది తెలియదు. ఆంధ్ర పోలీసులు ఢిల్లీలో అడుగుపెట్టారన్న గ్యాసిప్ లు వినిపించాయి. ఈ మేరకు లోకేష్ కూడా తన మకాం మార్చారని టాక్ మొదలయింది. కానీ ఇవి ఎంత వరకు నిజం అన్నది క్లారిటీ రావాల్సి వుంది.

నిజంగానే లోకేష్ కనుక ఢిల్లీ నుంచి ముంబాయికి మకాం మారిస్తే మాత్రం పార్టీ శ్రేణుల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. తమ యువ నాయకుడు లోకేష్ ఇంత భయస్తుడని, పోరాడడానికి జంకేవాడని తెలిస్తే వారు కూడా ఇంక ముందుకు రారు. ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తాయి. ఒక రోజు ఆగితే ఈ గ్యాసిప్ మీద క్లారిటీ వస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?