ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్ ఆయన వెంటనే ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్ చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. ఈ మధ్యకాలంలో చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన లేని లోటు లేకుండా చేస్తూ టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు చేయడాని పోసాని కృష్ణ మురళి ఖండించారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కాగానే సీఎం జగన్‌ను తిట్టడం మొదలు పెట్టిందని.. చంద్రబాబు బంధువు కాబట్టే ఆయన ఎంత దుర్మార్గుడు అయిన కక్షగట్టి బాబును అరెస్ట్ చేసినట్లుగా మాట్లాడుతోందని దుయబట్టారు. చంద్రబాబు తన పదవి కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే చెప్పారు. ఈ విషయం పురంధేశ్వరికి తెలియదా? అంటూ ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. అప్పుడు పురందేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బాలకృష్ణ ఇద్దరిని పిట్టలను కాల్చినట్టు కాల్చేశాడు.. పురందేశ్వరి వేడుకుంటే బాలకృష్ణ కోర్టుకు వెళ్లకుండా నాటి సీఎం వైయస్ఆర్ కాపాడారు. ఈ విషయం మీకు తెలియదా? ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ మీరు ఎలా చేరారు? బీజేపీ ఓడిపోతే మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారా? అంటూ ప్రశ్నించారు. పురందేశ్వరికి బీజేపీపై దోమంత కూడా ప్రేమ లేదంటూ ఎద్దేవా చేశారు. నిత్యం రాజకీయ పార్టీలు మారే మీకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు.
కాగా ఈ మధ్య కాలంలో మీడియా కనపడగానే పురందేశ్వరి బీజేపీ పార్టీ కంటే టీడీపీకే భజన చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి లాంటి వారు అంటూ కీర్తించడంతో పాటు సీఎం జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబును జైలు పంపించిన కోపం ఆమె కళ్ళల్లో కనపడుతోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.