చంద్రబాబును ఇలా అరెస్ట్ చేయగానే హైదరాబాద్ ను హుటాహుటిన బయల్దేరారు పవన్ కళ్యాణ్. కానీ తాను వెళ్లింది పార్టీ మీటింగ్ కు అని బుకాయించారు. కానీ చంద్రబాబు అరెస్ట్ ను చేసిన వెంటనే జైలుకు వెళ్లి కలిసారు.
బయటకు వచ్చి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అన్నట్లుగా పొత్తు ను ప్రకటించారు. ఆ పై ఉమ్మడి కార్యాచరణ వుంటుందన్నారు.
కట్ చేస్తే… ఆ తరువాత మరి పవన్ కళ్యాణ్ అదుపు అజా లేదు.
మంగళగిరిలోనే వున్నారని తెలుస్తోంది.
కృష్ణ జిల్లాలో వారాహి యాత్ర అన్నారు. అది కూడా లేదు.
ఈ నెలాఖరు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరి ఇంతకీ ఎందుకు పవన్ సైలంట్ అయ్యారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్.
దీనికి విశ్వస నీయ వర్గాల సమాచారం ప్రకారం వినిపిస్తున్న సంగతులు వేరుగా వున్నాయి.
భాజపా పవన్ కళ్యాణ్ కు మరింత ముందుకు వెళ్లకుండా కళ్లెం వేసినట్లు తెలుస్తోంది. తమను సంప్రదించకుండా పొత్తు ప్రకటించడం పై భాజపా అధిష్టానం కాస్త గట్టిగానే గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పవన్ కు కన్వే చేసినట్లు, దాంతో పవన్ సైలంట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మరోపక్క ఇంకో ముచ్చట కూడా వినిపిస్తోంది. ఉన్నట్లుండి చంద్రబాబును వెనకేసుకు వస్తూ, ఏ లెక్కలు తేల్చకుండానే, తేలకుండానే పొత్తు ప్రకటించడం పట్ల కాపు సంఘాల పెద్దలు గట్టిగా బాధ పడినట్లు తెలుస్తోంది. పైగా తెలుగుదేశం ఏం అన్నా పట్టించుకోవద్దని, పొత్తుకు బ్రేక్ అయ్యే పనులు ఏవీ చేయవద్దని కాపులకు పిలుపు ఇవ్వడం కూడా వారికి నచ్చలేదు. ఇవన్నీ పవన్ కు చేరవేయడం కూడా జరిగిందని తెలుస్తోంది.
వీటన్నింటికి అల్టిమేట్ పాయింట్ ఏమిటంటే లోకేష్, బాబు కనుక అందుబాటులోకి లేకపోతే నారా బ్రాహ్మిణి ని రంగంలోకి దింపుతారని వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది ఎల్లో మీడియా. ఇది కూడా పవన్ కు బాధ కలిగించిందని తెలుస్తోంది. తను పొత్తు పెట్టుకున్నాను కనుక ఆల్టర్ నేటివ్ గా తనను చూడాల్సి వుంటుందని, కానీ బ్రాహ్మణిని ఎంచుకోవడం అంటే ఎప్పటికి తను అధికారానికి చేరువ కాకూడదన్నది తెలుగుదేశం జనాల ఐడియా అన్నట్లు కనిపిస్తోందని పవన్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద అన్ని కారణాలు కలిసి పవన్ ను సైలంట్ చేసినట్లు తెలుస్తోంది.