అల వైకుంఠపురములో తరువాత బన్నీ-త్రివిక్రమ్ కలిసి మరో సినిమా ప్లాన్ చేసి వుంచుకున్నారు. సబ్జెక్ట్ ఓకె అయింది. మహేష్ తో చేస్తున్న సినిమా తరువాత త్రివిక్రమ్, అలాగే పుష్ప 2 తరువాత బన్నీ ఫ్రీ అవుతారు అప్పటి నుంచి ఈ సినిమా ప్రారంభం అవుతుంది అన్నది ఇప్పటి వరకు వున్న లెక్క.
బన్నీ కి ఏప్రిల్ 24 వరకు పుష్ప వర్క్ వుంది. త్రివిక్రమ్ కు జనవరి వరకు గుంటూరు కారం పని వుంది. అందువల్ల ఈ లెక్క పెర్ ఫెక్ట్ గా సరిపోతుందనే అనుకుంటూ వచ్చారు.
కానీ ఇప్పుడు బన్నీ కొత్త లెక్క వేస్తున్నారు. పుష్ప 2 సినిమాలతో తన పాత్రను జనవరి వేళకు ఫినిష్ చేయించేస్తే, త్రివిక్రమ్ గుంటూరు కారం పూర్తి చేసి, కొత్త స్క్రిప్ట్ తయారు చేసేసరికి ఆరెడు నెలల సమయం పడుతుంది. అందువల్ల ఈ గ్యాప్ లో కొత్త సినిమా ఒకటి ఫినిష్ చేసేస్తే ఎలా వుంటుంది అన్నది బన్నీ ప్లాన్. కానీ ఈ గ్యాప్ లో సినిమా చేయడానికి ఓ మంచి దర్శకుడు కావాలి. సబ్జెక్ట్ రెడీగా వుండాలి. అన్నీ సెట్ కావాలి.
ప్రస్తుతం అదే ప్రయత్నంలో వున్నారు బన్నీ. అందుకోసమే ముంబాయి వెళ్లి అట్లీతో డిస్కషన్లు సాగించి వచ్చారు. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ తో సినిమా కన్నా ముందే బన్నీ మరో సినిమా చేస్తారు. ఆ విధంగా పుష్ప సిరిస్ వల్ల నష్టపోయిన టైమ్ ను కవర్ చేసుకుందామని అనుకుంటున్నారు. అదీ సంగతి.