ఈ స్ట్రోక్‌తో చినబాబుకు పొలమారి ఉండాలే!

చినబాబు… తనకు ఉన్న తెలివితేటలు మరెవ్వరికీ లేవని అనుకుంటారో ఏమో అర్థం కావడం లేదు. తాను విమర్శిస్తే ఎంతటివారైనా.. నోటమాట రాక గింగిరాలు తిరగాల్సిందేననే అభిప్రాయం కూడా ఆయనకు బాగానే ఉండాలి. Advertisement అయితే…

చినబాబు… తనకు ఉన్న తెలివితేటలు మరెవ్వరికీ లేవని అనుకుంటారో ఏమో అర్థం కావడం లేదు. తాను విమర్శిస్తే ఎంతటివారైనా.. నోటమాట రాక గింగిరాలు తిరగాల్సిందేననే అభిప్రాయం కూడా ఆయనకు బాగానే ఉండాలి.

అయితే మామూలుగా… అధికారంలో ఉంటూ ప్రజల ఎదుట నోరు విప్పి మాట్లాడితే చాలు.. తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ  ప్రజలకు పుష్కలంగా కామెడీ సృష్టిస్తూ ఉండే చినబాబు లోకేష్.. రాజకీయ ప్రత్యర్థుల మీద సవాళ్లు విసిరితే.. వారు తిరిగి మాటలు సంధిస్తే ఏమైపోతారు? అందుకే ఉదాహరణే.. వల్లభనేని వంశీతో వివాదం!!

వల్లభనేని వంశీ.. ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు… అనే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. పార్టీని వీడదలచుకున్నారు. ఎటూ జగన్మోహనరెడ్డితో సన్నిహిత సంబంధం ఉంది.

ఆ పార్టీకి మద్దతుగా ఉండదలచుకున్నారు. ఇంతవరకు పరిణామాలు అంతా క్లియర్‌గానే జరిగాయి. ఆయన చాలా రోజుల కిందట పార్టీకి రాజీనామా చేస్తే.. ఇన్నాళ్లూ ఆయనను బుజ్జగించేందుకు విఫలయత్నం చేసి.. ఇప్పుడు పార్టీనుంచి సస్పెండ్ చేశారు.

ఈ సందర్భంలో వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేశ్ డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఆమోదం పొందలేదు గానీ.. వంశీ ఆల్రెడీ రాజీనామా చేశారని వార్తలొస్తున్నాయి. లోకేష్ మాటకు ఆయన కౌంటర్ ఇస్తూ.. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినందుకు ఉన్న ఎమ్మెల్సీ పదవికి కూడా అన్నం సతీష్‌కుమార్ రాజీనామా చేశారు.

మరి అంతే రోషం ఉంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలికదా.. ఆయన చేస్తే నేను కూడా చేస్తా అంటున్నారు. ఈ స్ట్రోక్‌తో బహుశా చినబాబుకు మాట పడిపోయి ఉండాలి.

ఎన్నికల వేళలోనే ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన వారిని చంద్రబాబు బలవంతంగా ఎమ్మెల్సీగా రాజీనామా చేయించారు. కానీ లోకేష్ మాత్రం చేయలేదు. ఆ పిరికితనానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు వంశీని  విమర్శించేసరికి.. ప్రతివిమర్శల్లో.. పాపాం లోకేష్ పరాభవ గాయాన్ని మళ్లీ కెలికినట్లు అయింది.