మంత్రిపదవి కాదు.. మళ్లీ టీటీడీ చైర్మన్‌..!

తను మంత్రి పదవికి కాంపిటేటర్‌ కాదని మొదటి నుంచి చెబుతూ వచ్చారు భూమన కరుణాకర్‌ రెడ్డి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే భూమన మంత్రి అవుతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం…

తను మంత్రి పదవికి కాంపిటేటర్‌ కాదని మొదటి నుంచి చెబుతూ వచ్చారు భూమన కరుణాకర్‌ రెడ్డి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే భూమన మంత్రి అవుతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు ఇదివరకే. ప్రత్యేకించి చిత్తూరుజిల్లా నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో మంత్రిపదవి విషయంలో ఆశావహులు గట్టిగా ఉన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్‌, రోజా, చెవిరెడ్డి వంటి ఫైర్‌బ్రాండ్స్‌ మంత్రి పదవుల రేసులో ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక భూమన పేరు కూడా ఆ విషయంలో నానుతూ ఉంటుంది. అయితే పార్టీ అధికారంలోకి వస్తే.. భూమన లక్ష్యం మంత్రిపదవి కాదని తెలుస్తోంది. ఆయన వెంకటేశ్వరుడి సేవనే కోరుకుంటున్నట్టుగా సమాచారం.

గతంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు భూమన కరుణాకర్‌ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఏడు కొండల అభివృద్ధిలో భూమన కృషిచేశారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో ఏడుకొండలు ఎక్కేవారు టీటీడీ చైర్మన్‌గా భూమన ఉన్నప్పుడు అక్కడ జరిగిన మార్పులను గమనించగలరు.

ఇక టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు వంటి కార్యక్రమాన్ని చేపట్టింది కూడా భూమన చైర్మన్‌గా ఉన్నప్పుడే. అలా టీటీడీ చైర్మన్‌గా తన ప్రత్యేకత చూపించిన భూమన కరుణాకర్‌ రెడ్డి మరోసారి ఆ పదవినే చేపట్టాలనే అభిలాషతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో వైఎస్సార్సీపీ నుంచి ఆయనకు పోటీ కూడా లేకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. 

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!