Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్స్ క్లూజివ్.. జెబి డబుల్ రోల్

ఎక్స్ క్లూజివ్.. జెబి డబుల్ రోల్

బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమా విశేషాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రూలర్ అన్న టైటిల్ నిన్ననే వెల్లడించాం. ఇప్పుడు మరో ఎక్స్ క్లూజివ్ విశేషం. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగపతి బాబు ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ రోల్ విషయంలో డిస్కషన్లు జరుగుతున్నట్లు బోగట్టా. జగపతిబాబు డబుల్ రోల్ అన్నది కాస్త ఆసక్తికర విషయమే.

విలన్ కు డబుల్ రోల్ ఏమిటి? దాని వైనం ఏమిటి అన్నది తెలియాల్సి వుంది. బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అన్నపుడు విలన్ కూడా అంతకు అంతా పవర్ ఫుల్ గానే వుంటాడు. మరి డబుల్ రోల్ అన్నపుడు ఇద్దరూ ఎలా వుంటారు? ఏమిటి? అన్న సంగతి తెలియాల్సి వుంది.

నిర్మాత సి కళ్యాణ్, హీరో బాలయ్య కూడా ఈ సినిమా మీద విపరీతమైన ఆసక్తితో వున్నారు. వీలయినంత త్వరగా ఫినిష్ చేసి విడుదల చేయాలని పట్టుదలగా వున్నారు. దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తే చకచకా ఫినిష్ చేసే పద్దతి గల దర్శకుడు. అందువల్ల ఈ సినిమా వీలయినంత త్వరగానే థియేటర్రలోకి వస్తుందని అనుకోవాలి.

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?