Advertisement

Advertisement


Home > Politics - Gossip

మీడియా అధినేతను కలిసిన జగన్ తల్లి!

మీడియా అధినేతను కలిసిన జగన్ తల్లి!

ఆంధ్ర రాజకీయాలను వదిలేసారు వైఎస్ విజయలక్ష్మి. రెండు చోట్ల వుండడం సరికాదని, ఆంధ్రలో కొడుకు జగన్ కు తన అవసరం అన్నా, తెలంగాణలో కూతురికే తన తోడు అవసరం అని ఆమె వెల్లడించారు. 

ఆంధ్రలో పార్టీ అధ్యక్ష పదవి వదులుకుని తెలంగాణకు పరిమితం అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఆమె ఓ మీడియా అధినేతను కలిసి మాట్లాడారన్న విషయం ఆసక్తి గొలుపుతోంది.

ఇప్పటికే చంద్రబాబు అంటే ప్రాణాలు ఇచ్చేసేంత అభిమానం వున్న ఓ మీడియా ప్రస్తుతం వైఎస్ షర్మిల కూడా మంచి ప్రాధాన్యతే ఇస్తోంది. మరి మిగిలిన ప్రధాన మీడియా సంస్థల సహకారం కూడా కూతురు కోసం విజయలక్ష్మి కోరుతున్నారని అనుకోవాలేమో?

ఓ ఛానెల్ అధినేతను కొన్నాళ్ల క్రితం విజయక్ష్మి స్వయంగా కలిసి చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ ఛానెల్ చాలా వరకు జగన్ అంటే అభిమానంగానే వుంటుంది. ఇప్పుడు అదే అభిమానాన్ని తన కూతురు మీద కూడా చూపించమని కోరడానికే విజయలక్ష్మి వచ్చారా? లేక వైఎస్ కుటుంబంతో ఆ ఛానెల్ అధినేతకు వున్న పరిచయం కారణంగా కలిసేందుకు వచ్చారా? అన్నది తెలియదు.

ఈ సమయంలో విజయలక్ష్మి పని గట్టుకుని, ఆమెనే స్వయంగా రంగంలోకి దిగి చానెల్ అధినేతను కలిసి మాట్లాడారు అంటే కచ్చితంగా షర్మిల పార్టీ కార్యక్రమాలకు ఇంతో అంతో కవరేజ్ బాగా ఇవ్వమని కోరడానికే అయి వుంటుందని రాజకీయ వర్గాల బోగట్టా.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా