శ్యాం జీకి మోదీ నివాళి ఇది

ఏ ఆర్టికల్ 370 రద్దుకోసం పోరాడుతూ ఉద్యమిస్తూ… తమ పార్టీ వ్యవస్థాపకుడు దార్శనికుడు అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ… అదే కాశ్మీరు జైలులోనే ప్రాణాలు విడిచారో.. ఆ అధికరణాన్ని చరిత్ర గర్భంలో కలిపేయడం ద్వారా.. మోదీ…

ఏ ఆర్టికల్ 370 రద్దుకోసం పోరాడుతూ ఉద్యమిస్తూ… తమ పార్టీ వ్యవస్థాపకుడు దార్శనికుడు అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ… అదే కాశ్మీరు జైలులోనే ప్రాణాలు విడిచారో.. ఆ అధికరణాన్ని చరిత్ర గర్భంలో కలిపేయడం ద్వారా.. మోదీ సర్కారు.. సరైన నివాళి అర్పించింది. ఇవాళ్టి భారతీయ జనతా పార్టీకి మాతృసంస్థ అయిన జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్వప్నాన్ని ఇన్నేళ్ల తర్వాత నరేంద్రమోడీ నెరవేర్చారు. తద్వారా రెండుసార్లు అధికారాన్ని తిరుగులేని మెజారిటీతో అందించడం ద్వారా దేశ ప్రజలు తననుంచి ఏం ఆశించారో… దానిని ఆయన నెరవేర్చారు.

శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాలుకు చెందిన చిత్తశుద్ధి కలిగిన నాయకుడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. పాలనలో చాలా విషయాల్లోను, ప్రత్యేకించి కాశ్మీరు విషయంలోనూ ఆయన నెహ్రూతో తీవ్రంగా విభేదించి 1950లోనే రాజీనామా చేసి బయటకు వచ్చారు. 1951లో జనసంఘ్ ను స్థాపించారు. అప్పటినుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ కాశ్మీరును భారత్ లో ‘సంపూర్ణంగా’ విలీనం చేయడానికి పోరాడుతూనే ఉన్నారు. అనేక రకాలుగా ఆయన అందుకోసం ఉద్యమిస్తూ వచ్చారు.

అప్పట్లో ప్రభుత్వంలో ఉంటూ.. నెహ్రూ ఆ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో… కనీసం జమ్మూ లడాఖ్ ప్రాంతాలనైనా.. ఎలాంటి రాయితీలతో నిమిత్తం లేకుండా భారత్ లో సంపూర్ణంగా విలీనం చేయాలని శ్యాం ప్రసాద్ ముఖర్జీ డిమాండు చేసేవారు. ‘ఏక్ దేశ్ మే దో నిషాన్.. దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేంగే’ అనేది ఆన నినాదం. అయితే ఆయన పోరాటాలను, వాదనలను నెహ్రూ సర్కారు చెవిన వేసుకోలేదు.

1953లో శ్యాంప్రసాద్ తన పోరాటంలో భాగంగా కాశ్మీరుకు వెళ్తే.. అప్పట్లో అక్కడ ప్రభుత్వంలో ఉన్న షేక్ అబ్దుల్లా సర్కారు.. ఆయనను అరెస్టు చేసి శ్రీనగర్ జైల్లో పెట్టింది. అలాంటి దుందుడుకు చర్యను అడ్డుకుని, ఆయనను విడుదల చేయించడం గురించి నెహ్రూ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. శ్రీనగర్ జైలులోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. జూన్ 23వ తేదీన అదే జైలులో గుండెపోటుతో మరణించారు. ఆ రకంగా తన తుదిశ్వాస వరకు కూడా.. జమ్మూకాశ్మీర్ ను భారత్ లో పరిపూర్ణంగా విలీనం చేయడం గురించి తపించిన నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ.

ఆయన స్థాపించిన జనసంఘ్ పార్టీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా మారింది. ఆరెస్సెస్‌కు అయినా, భాజపాకు అయిన.. వారి మూలాల్లో ఉన్న లక్ష్యం అది. ఆ రోజులనుంచి కూడా ఆర్టికల్ 370 రద్దు కోసం ఈ పార్టీ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ, పోరాడుతూ వచ్చింది. మోడీ కూడా గతంలో దీనికోసం పోరాడారు. దీక్షలు చేశారు. గతంలో వాజపేయి నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోలేని రాజకీయ పరిస్థితి వల్ల ఏం చేయలేకపోయారు.

2004లో నరేంద్రమోడీ నేతృత్వంలో.. ఒక్క భాజపాకే సంపూర్ణమైన బలంతో కేంద్రంలో భాజపా సర్కారు ఏర్పడినప్పుడు.. దశాబ్దాల నాటి పార్టీ లక్ష్యం నెరవేరుతుందని అంతా అనుకున్నారు. కానీ రాజ్యసభలో తమకు చాలినంత బలంలేని కారణాల దృష్ట్యా నరేంద్రమోదీ ఇలాంటి వివాదాస్పద అంశాలకు కాస్త దూరంగా ఉండిపోయారు. తిరిగి 2019లో గతానికి మించిన బలంతో కేంద్రంలో తన ప్రభుత్వం ఏర్పడేసరికి… ఆలస్యం చేయలేదు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, లడాఖ్ ప్రాంతాన్ని వేరు చేసి కీలక నిర్ణయం తీసేసుకున్నారు.

ఆ రకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ డెబ్భయ్యేళ్ల స్వప్నం.. ఇవాళ సాకారమైంది.

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్