
జనసేన పార్టీ పెట్టి పదేళ్లవుతోంది. అలాంటి పార్టీకి అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తప్ప, మిగిలిన నేతల గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ పార్టీకి అధ్యక్షుడే అన్నీ. మిగిలిన పదవులకు నియామకాలే జరగలేదు. కాదనకుండా నాదెండ్ల మనోహర్‌కు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా రెండు నియామకాలను పవన్‌కల్యాణ్ చేపట్టడం విశేషం.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబు, అలాగే జనసేన అధికార ప్రతినిధిగా వేములపాటి అజయ్‌కుమార్‌ను నియమించారు. జాతీయ మీడియా కోఆర్డినేషన్ బాధ్యతల్ని అజయ్‌కి అప్పగించారు. అయితే సుదీర్ఘ కాలం తర్వాత నాగ బాబుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించడం ఏంటబ్బా అని అంతా అనుకున్నారు. దీని వెనుక అసలేం జరిగిందో జనసేన విశ్వసనీయ వర్గాలు ఆశ్చర్యకర విషయాలు చెప్పుకొచ్చాయి.
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల మాదిరిగానే జనసేన కూడా నిధుల సేకరణ మొదలు పెట్టింది. ఇటీవల నాగబాబు నేతృత్వంలో కొందరు ఆస్ట్రేలియా వెళ్లారు. జనసేన అభిమానుల నుంచి నిధులు సేకరించారని సమాచారం. అయితే చిరంజీవి, పవన్‌కల్యాణ్, తదితర మెగా కుటుంబ సభ్యుల అభిమాన సంఘాల పేర్లతో కొందరు దేశవిదేశాల్లో జనసేన పేరు చెప్పి నిధులు సేకరణ చేపట్టారు.
ఎవరికి వారు భారీగా నిధులు సేకరిస్తూ, జేబులు నింపుకుంటున్న సంగతి పవన్‌కల్యాణ్‌కు తెలిసింది. గతంలో ప్రజారాజ్యం తరపున కూడా ఇట్లే నిధులు రాబట్టి, చివరికి ఆ పార్టీని భ్రష్టు పట్టించిన వైనం గురించి పవన్‌కు బాగా తెలుసు. ఇప్పుడు తనతో పాటు జనసేన పేరు చెప్పుకుని నిధులు రాబట్టడంపై పవన్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో నిధుల సేకరణ అంతా తన నమ్మకస్తుడైన నాయకుడి పర్యవేక్షణలో జరిగితే బాగుంటుందని పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తన అన్న నాగబాబు అయితేనే సరైన వ్యక్తిగా పవన్ భావించారు.
దీంతో పవన్‌కు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని అప్పగించారు. పార్టీని బలోపేతం చేయడంపై పవనే విడిచి పెట్టారనే విమర్శ వుంది. అలాంటిది నాగబాబు వచ్చి చేసేదేమీ ఉండకపోవచ్చు. నాగబాబు నియామకం వెనుక కేవలం ఆర్థిక అంశాలే ముడిపడి ఉన్నాయనేది జనసేనలో అంతర్గత చర్చ నడుస్తోంది. లోగుట్టు పవన్, నాగబాబులకు ఎరుక. కారణాలేవైనా కనీసం చెప్పుకోడానికి జనసేనకు కొత్త నాయకులొచ్చారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా