Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ ‘షో మాస్టర్’ చంద్రబాబేనా?

ఆ ‘షో మాస్టర్’ చంద్రబాబేనా?

చివరికి చంద్రబాబునాయుడు జీవితం ఇలా అయిపోయిందా అని అనుమానం కలుగుతోంది! ఇన్నాళ్లూ పార్టీలో ఆయన ప్రాపకం కోసం ఎగబడిన వాళ్లూ ఇప్పుడు ఆయనను వద్దనుకునే పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు తాజా వ్యవహారాలు, ఏడుస్తున్న ప్రజలను ఊరడించే ప్రయత్నాలూ ఇవన్నీ సొంత పార్టీలోనే అభాసు పాలవుతున్నట్లుగా కనిపిస్తోది.

ఎందుకంటే... తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మంగళవారం పొద్దున్నే 6.50 నిమిషాలకే తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్టుపెట్టారు. ‘‘టీడీపీ నౌ రిక్వయిర్స్ టాస్క్ మాస్టర్స్.. నాట్ షో మాస్టర్స్’’ అని ఒకే వాక్యాన్ని ఆ పోస్టులో పెట్టారు. తెలుగుదేశానికి ఇప్పుడు పనిచేసే మాస్టర్స్ కావాలి. షో మాస్టర్లు కాదు.. అని దాని భావం. పొద్దున నిద్రలేవగానే.. ఇలాంటి పోస్టు పెట్టాలనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది? నిద్దర్లో ఏమైనా కలగని, దాని భావాన్ని పెట్టారా అని సాధారణంగా మనకు డౌటొస్తుంది.

కానీ దీనిని విశ్లేషిస్తే... ఆ కామెంట్ చంద్రబాబు మీద వెటకారం అని బోధపడుతుంది. సాధారణంగా.. ఉదయం 6.50 గంటలు అంటే... నాయకులు పేపర్ చదివే సమయం. ఇవాళ దినపత్రికల్లో చంద్రబాబునాయుడు రైతుల్ని ఓదారుస్తున్న ఫోటోలు ప్రముఖంగా వచ్చాయి. లాఠీ చార్జి చేశారంటూ.. భోరున ఏడుస్తున్న రైతును చంద్రబాబు వాటేసుకుని ఓదార్చడం అనేది ఫోటోలోని ఘట్టం. జాగ్రత్తగా గమనిస్తే.. ఇటీవలి కాలంలో.. చంద్రబాబును కలుస్తున్న ప్రతివాళ్లూ ‘ఏడుస్తూనే’ ఉన్నారు. అందరూ ఏడుస్తున్నారో లేదో గానీ.. ఆయనను వాటేసుకుని ఏడుస్తున్న వారి ఫోటోలు మాత్రమే పేపర్లలో వస్తున్నాయి.

చంద్రబాబు గెలవలేదని ఏడ్చేవాళ్లు, ఆయన మెజారిటీ తగ్గిందని ఏడ్చేవాళ్లూ, జగన్ గెలిచాడని ఏడ్చేవాళ్లూ.. ఇప్పుడు లాఠీచార్జి జరిగిందని ఏడ్చేవాళ్లూ ఇలా ఏడుపులు పలువిధములుగా కొనసాగుతున్నాయి. నిద్దర్లేవగానే మళ్లీ ఓ ఏడుపు డ్రామాను చూసేసరికి కేశినేని నానికి చిర్రెత్తుకు వచ్చినట్లుగా ఉన్నది. అందుకే వెంటనే అక్కడికక్కడే పొద్దున్నే 6.50 గంటలకే తెలుగుదేశానికి టాస్క్ మాస్టర్లు కావాలే తప్ప.. షో మాస్టర్లు అక్కర్లేదంటూ ఘాటుగా ఓ పోస్టు పెట్టారు.

అలా షో మాస్టర్ అన్నది చంద్రబాబు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ సంగతి చంద్రబాబు తెలుసుకోగలుగుతారో.. మళ్లీ మందిని పోగేసుకుని.. వారు ఏడుస్తుండగా.. తాను ఊరడిస్తూ ఫోటోలు దిగి పత్రికలకు రిలీజ్ చేస్తారో చూడాలి.

అన్నా.. జగనన్నా.. చేర్చుకో అన్నా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?