Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఈ ధిక్కారాన్ని నరేంద్రమోడీ సహించగలరా?

ఈ ధిక్కారాన్ని నరేంద్రమోడీ సహించగలరా?

ప్రధాని నరేంద్రమోడీ  భారతీయ జనతా పార్టీలో వ్యక్తిస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చిన నాయకుడు. భారతీయ జనతా పార్టీ చరిత్రను చూసుకుంటే మోడీకి ముందు , మోడీకి తరువాత అని మాట్లాడుకోవాలి.

నిజానికి కేవలం ఆయన సాధించిపెట్టిన విజయాల వల్ల మాత్రమే కాదు.. ఆయన పార్టీలో తీసుకువచ్చిన కొత్తరకం సంస్కృతివల్ల కూడా అలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే.. మోడీకి ముందు బిజెపి అంటే సిద్ధాంతాల గురించి మాత్రమే మాట్లాడేది. విలువలను పాటించేది.

వాజపేయి, అద్వానీ వంటి దిగ్గజ నాయకులు ఉన్నప్పటికీ వ్యక్తిపూజ లేనేలేదు. లోపాయికారీ రాజకీయ వ్యవహారాలుండేవి కాదు. కానీ.. ఇప్పుడలా కాదు.. కాంగ్రెస్ మాదిరిగా వ్యక్తిపూజ పెరిగింది. వ్యక్తి ఆరాధనగా మారింది. భజనపరులు పెరిగారు. ఫిరాయింపులు వంటివాటి మీద ఆధారపడుతున్నారు.ఇలా పార్టీ సంస్కృతి సకలం మారింది. 

పార్టీలో ఇప్పుడు తాను దేవుడిలా చెలామణీ అవుతున్న నరేంద్రమోడీ తన నిర్ణయాల పట్ల ధిక్కారాన్ని తన సొంత పార్టీ వారినుంచి సహిస్తారా? అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చ. ఎందుకంటే.. ఆయన నోట్ల రద్దు వ్యవహారం అభాసుపాలయ్యేలా.. వెయ్యినోట్లను నిలిపేసి కొత్తగా తెచ్చిన రెండు వేల రూపాయల నోట్లను గురించి సొంత పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ మాట్లాడడం మోడీ నిర్ణయం పట్ల ధిక్కారమే. 

2000 నోట్ల వల్ల దేశంలో బ్లాక్ మనీ పెరుగుతోందని, వాటిని దశల వారీగా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ సుశీల్ కుమార్ మోడీ డిమాండ వినిపించారు. 

అయితే ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి.. వాటిని డిపాజిట్ చేసి చిన్న నోట్లుగా మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల వ్యవధి ఇవ్వాలని ఆయన సూచించారు. దానివల్ల బ్లాక్ మనీ అరికట్టడం అసలు జరగదు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ మాటలు చెప్పే సందర్భంలో.. మోడీ నిర్ణయాల పట్ల ఆయన నిప్పులు చెరగం గమనార్హం.వెయ్యినోట్లను రద్దుచేసి రెండువేల నోట్లను ఉంచడంలో అర్థం లేదని సుశీల్ అన్నారు. దీనివల్ల బ్లాక్గమనీకి అవి కేంద్రంగా మారాయన్నారు. 

ఒకవైపు నోట్ల రద్దు ద్వారా.. బ్లాక్ మనీని అరికట్టేశాం అని మోడీ దళం డప్పు కొట్టుకుంటూ ఉంటే.. సొంత పార్టీ ఎంపీ , పార్టీ పరువు తీసేలా ఇలాంటి ధిక్కారస్వరం వినిపించడం విశేషం. డ్రగ్స్ మనీ లాండరింగ్ వంటి అక్రమాలకు కూడా 2000 నోట్లు కారణం అవుతున్నాయని ఆయన ఈసడించారు. ఈ తిరుగుబాటు స్వరాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎలా స్వీకరిస్తారో తెలియదు. ప్రతిపక్షాల విమర్శలను తీసుకున్నట్టే ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి ఊరుకుంటారా? లేదా, సుశీల్ కుమార్ మోడీని టార్గెట్ చేసి.. ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంగళం పాడేస్తారా? అనేది తెలియదు. 

కానీ 2000 నోట్లతో బ్లాక్ మనీ పెరగడమే తప్ప తగ్గేది కాదనే సంగతి ప్రజలందరూ అనుకునేదే. సొంత పార్టీ ఎంపీ అనడం వల్ల ఇది మరోసారి చర్చలోకి వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?