చెరగిపోనున్న నిజాం ఆనవాళ్లు

అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులకు చరిత్రలో తమ ముద్ర మిగిలేలా ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది. చరిత్రలో తమకీర్తి శాశ్వతంగా ఉండాలంటే ఆ చేసేదేదో గతంలో ఎన్నడూ ఎవ్వరూ చేసి ఉండనిది, గతంకంటే ఘనమైనది…

అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులకు చరిత్రలో తమ ముద్ర మిగిలేలా ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది. చరిత్రలో తమకీర్తి శాశ్వతంగా ఉండాలంటే ఆ చేసేదేదో గతంలో ఎన్నడూ ఎవ్వరూ చేసి ఉండనిది, గతంకంటే ఘనమైనది ఉండాలని వారు కలగంటారు. దానికోసం నిత్యం పరితపిస్తుంటారు, కష్టపడుతున్నారు. ఈ ఆలోచన మంచిది. కానీ ఆ క్రమంలో చరిత్రలో భాగమైన గత పాలకుల ముద్రలను చెరపివేయాలని అనుకోవడం మాత్రం సరికాదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడు ప్రదర్శిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన అలాంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరానికి వన్నెతెచ్చేలా, చరిత్రలో నిలిచిపోయేలాగా అత్యద్భుతమైన భవనాలు కొన్నింటిని తన హయాంలో నిర్మించాలని తొలినుంచి ఉత్సాహంగా ఉన్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి గత అయిదేళ్లుగా కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అప్పట్లో పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోయిన నేపధ్యంలో, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తదనుగుణంగా ప్రారంభించారు. కేవలం నూతన సెక్రటరీయేట్ మాత్రమే కాకపోవచ్చు నూతన అసెంబ్లీ నిర్మాణాన్ని కూడా సంకల్పిస్తున్నారు. దీనిని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును కూడా నూతన భవన సముదాయంలోకి మార్చే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఉస్మానియా హాస్పిటల్‌ను ప్రయత్నం కూడా జరిగింది. నాళ్ళ కిందట ఎర్రమంజిల్ లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయాన్ని కూడా మార్చే ప్రయత్నం జరిగింది. ఆయా భవనాలు పాతవి అయిపోయాయి గనుక వాటిని వినియోగంలో లేకుండా ఉంచేస్తారనే ప్రచారం కూడా జరిగింది. సరిగ్గా ఇక్కడే కొందరిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవన్నీ కూడా నిజాం కాలంనాటి చారిత్రక కట్టడాలు. నాలుగు వందల ఏళ్ల పైబడిన సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాదు నగరం చారిత్రక వైభవానికి అవి చిహ్నాలు. తమ ముద్ర మిగిలితే చాలని నాయకులు కోలుకోవడం ఎంత సమంజసమో, చారిత్రక సంపదను దానికి కట్టుబడి ఉండడం కూడా అంతే అవసరం. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు.

అసెంబ్లీ, హైకోర్టు, ఉస్మానియా హాస్పిటల్ ఇలాంటి వాటిని కొత్తగా నిర్మించిన భవనాల్లోకి బదలాయించిన తర్వాత ఈ పాల వైభవోపేతమైన భవనాల్ని ఏం చేస్తారనే విషయంలో ఇప్పటిదాకా ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. అవి నగర చరిత్రకు ఆనవాళ్లుగా ఎప్పటికీ ప్రపంచానికి దర్శనీయ స్థలాలుగా ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే!