Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఏ ఒక్కటీ మిస్సయ్యే చాన్సులేదు!

ఏ ఒక్కటీ మిస్సయ్యే చాన్సులేదు!

ప్రభుత్వంలోకి వచ్చినవాళ్లు తాము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనే అహంకారపూరితమైన ధోరణితో ఉండడం చాలా పొరబాటు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు. వెన్నాడుతూనే ఉంటాయి. దీనికి నిదర్శనం జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. బయటకు వస్తున్న పాత ప్రభుత్వపు అవినీతి బాగోతాలే. అయితే గత అయిదేళ్లలో ఇంకా ఏయే రేంజిలో అక్రమాలు చేశారో వాటిలో ఏ ఒక్కటీ కూడా మిస్సయ్యే అవకాశమే లేదని అనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అయిదేళ్లలో తీసుకున్న కీలక విధాన నిర్ణయాలపై సమగ్రంగా దర్యాప్తు జరిపించేందుకు జగన్ సర్కారు పదిమంది పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద సమీక్షించేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. కొన్నివారాల కిందట ఆ ఉపసంఘం ముఖ్యమంత్రికి తమ నివేదిక అందజేయడం కూడా జరిగింది. ఆ నివేదికలోని అన్ని అంశాల గురించి ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది.

విభజన తర్వాత.. ఏర్పడిన కొత్త ప్రభుత్వం... విధాన, న్యాయ, ఆర్థికపరమైన అనేక అవతకవకలకు పాల్పడినట్లుగా అప్పట్లో కూడా ఆరోపణలు వచ్చాయి. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన ఈ అవినీతి బాగోతాలపై మంత్రి వర్గ ఉపసంఘం క్షుణ్నంగా దర్యాప్తు జరిపింది. నివేదికలోని మొదటి భాగాన్ని ముఖ్యమంత్రికి అప్పగించారు. అందులోని అంశాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడీ సిట్ ను ఏర్పాటుచేసింది.

అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు, సీఆర్డీయే పరిధిలో జరిగిన భూమి క్రయవిక్రయాల లావాదేవీలపై కూడా సమగ్రంగా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు జరుపుతూ కేసులు నమోదు చేస్తుంది. అవసరాన్ని బట్టి కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటుంది. వ్యక్తులు, నాయకులు, అధికారుల్లో ఎవరినైనా తమ వద్దకు పిలిపించుకుని విచారించే అధికారం వీరికి ఉంటుంది. విచారణతో పాటు, చార్జిషీటు దాఖలు చేసే అధికారం కూడా కలిపి దీనిని ఏర్పాటుచేశారు. ఈ సిట్ విచారణలో పాతప్రభుత్వం  అవినీతి బాగోతాల్లో ఏ ఒక్కటీ కూడా మిస్సయ్యే చాన్సు లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?