Advertisement

Advertisement


Home > Politics - Gossip

విపక్ష నేత కూడా జై అంటున్న దూకుడు!

విపక్ష నేత కూడా జై అంటున్న దూకుడు!

కాశ్మీర్ లో 370వ అధికరణాన్ని రద్దు చేసిన నాటినుంచి.. అక్కడి వ్యవహారాల గురించి బాహ్యప్రపంచానికి నివేదించే విషయంలో మోడీ సర్కారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా బ్రిటన్ నించి లేబర్ పార్టీ పార్లమెంటరీ సభ్యురాలు డెబీ అబ్రహాం కాశ్మీర్ సందర్శించడానికి వస్తే వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఆమె రావడానికి ముందే.. ఆమె ఈ-వీసాను రద్దుచేసి.. ఆ విషయం ఆమెకు మెయిల్ ద్వారా కూడా  భారత ప్రభుత్వం తెలియజేసింది. అయినా సరే ఖాతరు చేయకుండా.. ఆమె రావడంతో.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత.. దేశంలోకి అనుమతించకుండా.. ఆమెను అక్కడినుంచే వెనక్కు తిప్పి పంపారు.

డెబీ అబ్రహాం కేవలం బ్రిటన్ ఎంపీ మాత్రమే కాదు.  ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ కాశ్మీర్ అనే సంస్థకు  ఛైర్ పర్సన్ కూడా! ఆమె ఆర్టికల్ 370 రద్దును తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. 370 రద్దు విషయంలో మాట్లాడడం అనేది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని.. అది తమకు సమ్మతం కాదని.. మోడీ ప్రభుత్వం తొలినుంచి స్పష్టీకరిస్తూనే వస్తోంది. అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ డెబీ మాత్రం.. ఆ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి.. కాశ్మీర్ ను సందర్శించాలనే మిషపై భారత్ కు వచ్చారు.

అయితే డెబీని అలా తిప్పిపంపడాన్ని విపక్ష కాంగ్రెస్ నాయకులు కూడా సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ప్రతి చర్యను తిప్పికొట్టాల్సిందేనంటూ హితవు చెప్పారు. ప్రభుత్వ చర్యను సమర్థించారు. పైగా పాక్ , ఐఎస్ఐలతో చేతులు కలిపిన వ్యక్తి అంటూ డెబీ అబ్రహాంపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.

అయితే  ఇదే వ్యవహారంపై ప్రభుత్వం వైఖరిని మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం తప్పుపట్టారు. ఏది ఏమైనప్పటికీ.. కాశ్మీర్ విషయంలో.. అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా.. ఎలాంటి బయటి శక్తుల ప్రమేయాన్ని అనుమతించడానికి మోడీ సర్కారు సిద్ధంగా లేదు. ఆ విషయాన్ని డెబీ అబ్రహాంను తిప్పిపంపడం ద్వారా వారు అంతర్జాతీయ సమాజానికి మరింత నిక్కచ్చిగా చెప్పినట్లయింది.

రష్మికని దారుణంగా ఆడేసుకున్నారు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?