శ్రీ‌రెడ్డి VS క‌రాటే క‌ల్యాణి

సోష‌ల్ మీడియా వివాదం పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లింది. సినీ న‌టి క‌రాటే క‌ల్యాణి ఫిర్యాదు మేర‌కు హీరోయిన్ శ్రీ‌రెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివాదానికి సోష‌ల్ మీడియా వేదికైంది. సోష‌ల్ మీడియాలో…

సోష‌ల్ మీడియా వివాదం పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లింది. సినీ న‌టి క‌రాటే క‌ల్యాణి ఫిర్యాదు మేర‌కు హీరోయిన్ శ్రీ‌రెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివాదానికి సోష‌ల్ మీడియా వేదికైంది. సోష‌ల్ మీడియాలో త‌న‌పై శ్రీ‌రెడ్డి అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని క‌రాటే క‌ల్యాణి హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అయితే చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య అన్న‌ట్టుగా శ్రీ‌రెడ్డి, క‌రాటే క‌ల్యాణిల మ‌ధ్య కేసుల వ్య‌వ‌హారం త‌యారైంది. ‘కాస్టింగ్‌ కౌచ్‌’ ఆరోపణలతో శ్రీ‌రెడ్డి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఆ సంద‌ర్భంలో క‌రాటే క‌ల్యాణి ప‌లు చాన‌ళ్ల‌లో త‌న‌పై అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు అప్ప‌ట్లో శ్రీ‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు రెండేళ్ల క్రితం క‌రాటే క‌ల్యాణిపై హుమ‌యున్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తనను బెదిరించిన కల్యాణిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీరెడ్డి కోరారు.

గ‌త రెండేళ్లుగా సోష‌ల్ మీడియా, చాన‌ళ్ల వేదిక‌గా వారిద్ద‌రి మ‌ధ్య వివాదం న‌డుస్తూనే ఉంది. ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డికి త‌మిళ సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కాయి. దీంతో ఆమె త‌న మ‌కాంను హైద‌రాబాద్ నుంచి చెన్నైకి మార్చారు. ఏపీ రాజ‌కీయాలు, సినిమా సంగ‌తుల‌పై ఆమె సోష‌ల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నారు.

ప‌వ‌న్‌తో పాటు ప్రముఖ దర్శకులు ఏఆర్‌ మురుగదాస్, సుందర్‌.సి, నటులు రాఘవ లారెన్స్‌, శ్రీరామ్‌, హీరో విశాల్‌పై కూడా శ్రీ‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేప‌థ్యంలో శ్రీ‌రెడ్డికి శ‌త్రువులు పెరిగారు. శ్రీరెడ్డిపై చాలా మంది కేసులు పెట్టారు. ఆ కేసుల‌కు తాజాగా క‌రాటే క‌ల్యాణి పెట్టిన కేసు జ‌త అయ్యింది. వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం ఎటు వైపు ట‌ర్న్ తీసుకుంటుందో చూడాలి.