Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్ అడుగుతోంది స్పష్టత మాత్రమే! హోదా కాదు!!

పవన్ అడుగుతోంది స్పష్టత మాత్రమే! హోదా కాదు!!

రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అని అనుకోవాల్సిందే. మెలికవేసిన మాటలు మాట్లాడడం.. తద్వారా.. తాము ఎన్నడూ ఏ మాటకూ కమిట్ కాకుండా తప్పించుకోవడం అనేది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అమెరికా నుంచి పవన్ కల్యాణ్ కూడా అలాంటి విద్యను పుష్కలంగా ప్రదర్శిస్తున్నారు. భాజపాతో స్నేహబంధం గురించి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

భాజపా కీలకనేత రాంమాధవ్ తో పవన్ కల్యాణ్ అమెరికాలో భేటీకావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆదివారం సంచలనాంశంగా మారింది. సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ విషయానికి సూటిగా జవాబు చెప్పకుండా సమాధానం దాటవేస్తూనే... పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలు భాజపా మీద తనకు ఎన్నడూ ద్వేషభావం లేదంటూ ప్రేమ ఒలకబోయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

భాజపాతో గతంలో కలిసి పనిచేశానని, వ్యక్తిగతంగా గొడవలు లేవని పవన్ చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వమని కోరుతున్నానే తప్ప ఇతరత్రా గొడవలు లేవంటూ వ్యాఖ్యానించారు. ఆ మాటకొస్తే ఇలాంటి డైలాగును ఏ పార్టీ గురించి అయినా ఏ నాయకుడైనా చెప్పగలరు. ప్రజలకోసం ప్రశ్నించానే తప్ప తెలుగుదేశంతో గొడవలులేవు.. పాలన సక్రమంగా ఉండాలని కోరుకున్నానే తప్ప వైకాపాతో గొడవలు లేవు అని కూడా అనవొచ్చు. ఆ తర్వాత ఈ మాటలను ఎలాగైనా తమ చేతలకు అనుగుణంగా మార్చుకోవ్చు.

ఘోరం ఏంటంటే.. ఇదివరకు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే అని రోడ్లెక్కి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడిన పవన్ కల్యాణ్, ఇవాళ ఆ హోదా గురించి స్పష్టత ఇస్తే చాలునని అంటున్నారు. దీన్ని బేస్ చేసుకుని.. హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా కారణాల వల్ల సాధ్యంకాదు.. హోదాకు మించిన సాయం తప్పకుండా చేస్తాం మాట ఇస్తున్నాం అనే బీజేపీ కొత్త పాట ఎత్తుకున్నదంటే చాలు.. పవన్ కల్యాణ్ దానికి వంత పాడడానికి సిద్ధంగా ఉంటారు. నెమ్మదిగా భాజపాతో విలీనం అయిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. పవన్ మాటలను నిజమైన ఆవేశంగా భ్రమించిన ప్రజలు మూర్ఖులుగా మిగులుతారు.

ఇప్పుడు కాపీ కొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?