Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎమోషన్ అయిపోయిన విజయ్

ఎమోషన్ అయిపోయిన విజయ్

విజయ్ దేవరకొండ పబ్లిక్ ఫంక్షన్ లలో చాలా బాగా మాట్లాడతాడు. ఆ మాటల్లో ఓ రకమైన నేటివిటీ వుంటుంది. సహజత్వం వుంటుంది. సరదా వుంటుంది. కానీ తొలిసారి ఫుల్ ఎమోషనల్ అయిపోయి మాట్లాడిన సందర్భం ఇది. విజయ్ సోదరుడు ఆనంద్ తొలిసారి నటించిన దొరసాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ మాట్లాడుతూ చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయాడు. దానికి కారణం కూడా విజయ్ నే చెప్పాడు.

తన తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తన కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో? తను నటుడు కావడానికి అవసరమైన సాయం ఏ విధంగా చేసాడో కొద్ది మాటల్లోనే అన్యాపదేశంగా చెప్పాడు. అలాంటిది అమెరికాలో ఉద్యోగం వదిలి వస్తానంటే తనకు నచ్చలేదని చెప్పాడు. అలాగే నటుడు అవుతాను అని చెప్పినా తనకు నచ్చలేదని చెప్పాడు.

తనంతట తానే సినిమా చేసుకోమని, స్క్రిప్ట్ చూసుకోమని, పాట్లు అన్నీ పడమనీ వదిలేసానని, సినిమా లోకంలో ఓ సినిమా చేయడం అంటే ఎంత కష్టమో తెలియాలని, అవమానాలు, ట్రొలింగ్ లు భరించే శక్తి రావాలని, అన్ని విధాలా రాటు దేలాలని అలా చేసానని చెప్పాడు. 

ఇవన్నీ తను బలవంతంగా చేసానని, పాటలు బాగున్నా చెప్పలేదు, షేర్ చేయలేదు, టీజర్, ట్రయిలర్ బాగున్నా మాట్లాడలేదు, ఎవరు అడిగాన నాకేం తెలియదనే చెప్పా, అన్నీ అలా అణచుకున్నా అంటూ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసాడు విజయ్.  సినిమా చూసిన తరువాతే ఫంక్షన్ కు వస్తానని, బాగు లేకుంటే మరొకర్ని చూసుకోవాల్సి వుంటుందని చెప్పానని, సినిమా చూసిన తరువాత ఆశ్చర్యం వేసిందని, ఈ పిల్లలు అంతా కలిసి ఇంత మంచి సినిమా చేసారా? అని అనిపించిందని విజయ్ అన్నాడు.

హీరోయిన్ శివాత్మిక మంచి నటి అని 12 తరువాత అందరూ ఒప్పుకుంటారని, ఆనంద్ గురించి తనేం చెప్పనని, 12న తరువాత ప్రేక్షకులే చెబుతారని విజయ్ చెప్పుకొచ్చాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?