Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్ కళ్యాణ్ భారీ ఫార్మ్ హౌస్

పవన్ కళ్యాణ్ భారీ ఫార్మ్ హౌస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ భారీ ఫార్మ్ హౌస్ ను నిర్మిస్తున్నారు. 

గండిపేట..చిలుకూరు మధ్యలో 16 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీ వుంది ఆయనకు. ఇక్కడే చిన్న ఫార్మ్ హౌస్ కూడా వుంది. 

ఇక్కడే కొన్ని ఆవులు కూడా వున్నాయి. పవన్ తరచు అక్కడ సేదతీరుతుంటారు. ఇప్పుడు ఆ ఇల్లును పూర్తిగా పగగొట్టి, కొత్తగా భారీగా ఇల్లు కట్టడం మొదలుపెట్టారు.

ఆ పని మీద పవన్ తరచు సిటీ నుంచి ఫార్మ్ కు వెళ్లి వస్తున్నారు. ఓ ప్రముఖ సంస్థకు అన్ని బాధ్యతలు అప్పగించారు. 

ఆ ప్రాంతంలో ఎకరా 10 కోట్లు పలుకుతోంది. అంటే పవన్ వ్యవసాయ భూమి ఖరీదే 160 కోట్లు అన్నమాట. అలాంటి చోట మాంచి ఇల్లు కట్డడానికి ఎలా లేదన్నా మరో అయిదారు కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుంది.

ఈ మధ్యన కాస్త జ్వరం పడి లేచిన పవన్ నిత్యం ఈ ఫార్మ్ హౌస్ పనులను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?