
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుపెట్టాలని కలలు కంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ వర్గాలు.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా సింగిల్ గా వెళ్ళబోనని ఇప్పుడికే ప్రకటించిన నేపథ్యంలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీకి కేటాయించే సీట్ల వల్ల పవన్ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో రకరకాల సర్వేలతో, తన సామాజిక వర్గ నేపథ్యము, చంద్రబాబు సలహా మేరకు రెండు చోట్ల పోటీచేసి రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీడీపీతో పొత్తులో భాగంగా రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యే సీట్లలో జనసేన పార్టీకి ఒక 10% నుండి 15% స్ధానాలను కేటాయించిన ఇప్పటికై జనసేన పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టినవారు, జనసేనలోని చంద్రబాబు మనుషులకే సరిపోతాయి. అందుకే పవన్ ను ఒక్క స్థానానికే పరిమితం చేసీ టీడీపీ కోసం రాష్ట్రం మొత్తం ప్రచారం చేయించాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
రాయలసీమలో తన పార్టీకి బలం లేదని ముందే ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లోని తన సామాజిక వర్గ ఓటర్లుఎక్కువగా ఉండే స్థానంలో పోటీ చేయబోతున్న కూడా ముందే ప్రకటిస్తే తన ఓటమికి ఇతర పార్టీలు గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడతారని అనుమానంతో సైలెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల కంటే ముఖ్యంగా తను గెలిచి ఎమ్మెల్యేగా కావాలన్నది పవన్ ధ్యేయం.
కాగా గత ఎన్నికల్లో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీతో పొత్తుపెట్టుకొని ఒక్క స్థానంలో పోటీ చేస్తే గెలుస్తారా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే చంద్రబాబు తెరవెనక రాజకీయాలు గురించి తెలిసిన వారు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కి పూర్తిస్థాయిలో టీడీపీ నుండి సపోర్టు వస్తుందని అనుకోవడం భ్రమనే.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా