Advertisement

Advertisement


Home > Politics - Gossip

అనుచరులపై పవన్ ఆగ్రహం?

అనుచరులపై పవన్ ఆగ్రహం?

చెప్పింది చేయండి.. చరిత్ర అడక్కు అనే టైపు సినిమా హీరోల వ్యవహారం. మరి అలాంటి టాప్ హీరో పార్టీ పెడితే ఎలా వుంటుంది. అలాగే వుంటుంది.

తను ఒకర్ని తీసుకురమ్మంటే నలుగుర్ని తీసుకువస్తే కోపం రాదా? వస్తుంది. వచ్చింది కూడా. విషయం ఏమిటంటే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఓ విషయమై తన అనుచరుల మీద ఆగ్రహం వ్యక్తం చేసారన్నది? ఎందుకు? అంటే.. కథ చాలా వుంది.

తూర్పుగోదావరి మండపేట నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. జనసేనకు ఓ మాట చెప్పలేదు.. చేయలేదు. ఏం చేసినా, ఎలా చేసినా జనసేన తమతోనే వుంటుందని తెలుగుదేశం పెద్దలు టేకిట్ గ్రాంట్ గా తీసుకున్నట్లున్నారు. కానీ ఓట్ల బదిలీ, జనసేన జనాలు అసంతృప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత పవన్ మీద వున్నాయి కదా? అందుకే మండపేటలో జనసేన టికెట్ ఆశించిన వ్యక్తిని తీసుకువస్తే, బుజ్జగిద్దామని అనుకున్నారట.

తీసుకురమ్మని తన అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్లు ఏకంగా ముగ్గురు నలుగుర్ని తీసుకువచ్చారట. వాళ్లు పాపం, అమాయకంగా తమ నేత మనోగతం తెలియకుండా, మండపేటలో తెలుగుదేశం చేస్తున్న పనులు, తమ విజయావకాశాలు, వివరించి, జనసేన పోటీ చేయాల్సిందే. గెలుపు పక్కా అంటూ చకచకా మాట్లాడేసారని తెలుస్తోంది. అన్నీ విని, వాళ్లకు చెప్పాల్సింది చెప్పి పంపించి, ఆ తరువాత తన అనుచరుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఒక్కరిని తీసుకురమ్మంటే అంత మందిని ఎందుకు తెచ్చారన్నది కోపానికి కారణంగా తెలుస్తోంది. మీరు టికెట్ ఆశించిన వారిని తీసుకురమ్మన్నారని తెచ్చామని వారు బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కోపానికి అనుచరులు కాస్త ఫీలయ్యారని, అందువల్లే ఈ వార్త బయటకు వచ్చిందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?