ఎమ్మెల్యేలకు పవన్ మార్క్ షాక్?

ఉమ్మడి విశాఖ జిల్లాలో తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల జోరుకు అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ కళ్ళెం వేసారు అని అంటున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గింది ప్రజలకు సేవ చేయడానికి అని హిత బోధ…

ఉమ్మడి విశాఖ జిల్లాలో తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల జోరుకు అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ కళ్ళెం వేసారు అని అంటున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గింది ప్రజలకు సేవ చేయడానికి అని హిత బోధ చేశారు అని అంటున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు పారిశ్రామిక ప్రాంతాలలో ఉండడంతో వారు అక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అని వార్తలు వచ్చాయని అంటున్నారు.

అవి పవన్ దాకా చేరడంతో ఆయన వారిని పిలిచి మరీ సున్నితంగానే చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు. ప్రజా ప్రతినిధులుగా మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఈ రకంగా దూకుడు చేయడం కరెక్ట్ కాదని పవన్ స్పష్టం చేసినట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పారిశ్రామికవేత్తలు అయితే ఈ దందాలు తాము భరించలేమని తమను వాటాలు అడిగితే యూనిట్లు మూసేసుకోవడం మినహా వేరే మార్గం లేదని ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. వారి నుంచి వెళ్ళిన ఫిర్యాదుల మేరకే పవన్ అలా స్పందించారు అని అంటున్నారు.

అలాగే మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇదే రకమైన ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు వస్తున్నాయన్న సమాచారంతోనే పవన్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటున్నారు. తన దృష్టికి సొంత పార్టీ మీద విమర్శలు రావద్దు అని పవన్ స్పష్టం చేశారు అని అంటున్నారు.

ఎవరైనా ప్రజా సేవ చేయాలని పది మందినీ కలుపుకుని పోవాలి తప్పించి రౌడీ రాజకీయాలు చేస్తే సహించేది లేదని పవన్ ఒక స్పష్టమైన సందేశం పంపించారు అని అంటున్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే వారిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధం అని పవన్ చేసిన తీవ్ర హెచ్చరిక ఎమ్మెల్యేలకు గట్టిగానే పనిచేస్తుంది అని అంటున్నారు.

ప్రజలతో మర్యాదగా ఉండాలని పార్టీ కార్యకర్తలను దగ్గరకు తీయాలని పవన్ సూచించారు అని అంటున్నారు. కార్యకర్తలను గుర్తించి వారిని కలుపుకొని పోవాలని పవన్ హితవు చెప్పారని అంటున్నారు. ఆరోపణలు ఎవరి మీద వచ్చినా స్పేర్ చేయను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందేశం హాట్ టాపిక్ గా పార్టీలో ఉందని అంటున్నారు.

One Reply to “ఎమ్మెల్యేలకు పవన్ మార్క్ షాక్?”

  1. :red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

Comments are closed.