పవన్ కు పరిక్షలు నచ్చవా?

పవన్ అభిమానులు కూడా సరైన సమాధానం చెప్పలేని ప్రశ్న ఏదన్నా వుందీ అంటే అది ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇంటర్ అంటారు. ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్ ప్రస్తావించారు. డిగ్రీ దాకా వెళ్లారో లేదో…

పవన్ అభిమానులు కూడా సరైన సమాధానం చెప్పలేని ప్రశ్న ఏదన్నా వుందీ అంటే అది ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇంటర్ అంటారు. ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్ ప్రస్తావించారు. డిగ్రీ దాకా వెళ్లారో లేదో తెలియదు. సరే, ఇవన్నీ ఇలా వుంచితే టిక్ టాక్ లో పెద్ద ఫన్ ఏమిటంటే, 'కరోనా బ్యాచ్' అనే వెక్కిరింత విడియోలు బాగా చలామణీ అవుతున్నాయి. నిజానికి బాగా చదువుకున్న వారికి పరిక్షలు అనేవి ఓ ఛాలెంజ్. వాటిని దాటి, మంచి ర్యాంక్ తెచ్చుకోవడం అన్నది ఓ కిక్.

అయితే కరోనా కారణంగా పరిక్షలు నిర్వహించడం కాస్త కష్టం అవుతోంది. అందుకే టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరిక్షలు ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇవి చాలదు ఇప్పుడు ఎంబిఎ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరిక్షలు, బిఎ, బిఎస్సీ లాంటి గ్రాడ్యుయేషన్ కోర్సులు, పాలిటెక్నిక్ పరిక్షలు కూడా క్యాన్సిల్ కొట్టేయాలంటున్నారు పవన్ కళ్యాణ్. టెన్త్ పరిక్షలు అన్నవే స్టూడెంట్స్ ఒక కొలమానం. అయితే ఆ తరువాత ఇంటర్ కు, మరే ఇతర కోర్సులకు అయినా ఎంట్రన్స్ లు వుంటాయి కాబట్టి కొంత వరకు ఫరవాలేదు.

కానీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఎ లాంటి కోర్సులు ఉద్యోగాలకు కాస్త కీలకం. సరైన మార్కులు, గ్రేడ్ లు కావాలి. ముందటి ఏడాది మార్కులు , ఇంటర్నల్ మార్కులు బేస్ చేసుకునో అంకెలు వేసేసి పాస్ చేయించేస్తే భవిష్యత్ లో ఇబ్బంది కావచ్చు.

పైగా టెన్త్, ఇంటర్ అంటే లక్షల మంది వుంటారు. డిగ్రీ అంటే కొంచెం తక్కువ మంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంకా తక్కువ మంది వుంటారు. పైగా ఏజ్ గ్రూప్ ఎక్కువ.అందువల్ల కరోనా జాగ్రత్తలు తీసుకోవడం సులువు. పైగా ఫైనల్ స్టేజ్ ఆఫ్ స్టడీ కాబట్టి కొన్నాళ్లు వెయిట్ చేయడానికి అవకాశం వుంటుంది. 

మరి అలాంటి పరిక్షలు కూడా పవన్ వాయిదా వేయమని అడగడం ఏమిటో? టెన్త్ వాయిదా వేయమని అడిగాను, వేసారు. ఇప్పుడు ఇవి కూడా వేయమంటే, అలాగే చేస్తే స్టూడెంట్స్, వాళ్ల ఫ్యామిలీల దృష్టిలో మంచి మార్కులు పడతాయని పవన్ ఐడియాయేమో? రాజకీయాల్లో ఇలాంటి చిన్నచిన్న ట్రిక్ లు ఈ రోజుల్లో అంతగా పనిచేయవు అన్న సంగతి ఆయనకు తెలియదేమో?

అమరావతినే కొనసాగిస్తారా ?