పవన్ దూకుడు కమలానికి చేటేనా?

మహాఅయితే ఆరు శాతానికి ప్రజల్లో బలం లేని పవన్ కల్యాణ్ తో  పొత్తు పెట్టుకోవడం అనేదే.. భారతీయ జనతా పార్టీలోని చాలా మంది ఏపీ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదు. స్థానిక నాయకుల నుంచి…

మహాఅయితే ఆరు శాతానికి ప్రజల్లో బలం లేని పవన్ కల్యాణ్ తో  పొత్తు పెట్టుకోవడం అనేదే.. భారతీయ జనతా పార్టీలోని చాలా మంది ఏపీ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదు. స్థానిక నాయకుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కొన్నాళ్లు పొత్తు ఉన్నట్లుగా ఉంటే వచ్చే నష్టమేం లేదులే అనే ఉద్దేశంతో కేంద్ర నాయకత్వం అందుకు అంగీకరించింది. పైగా, పవన్ కల్యాణ్ పదేపదే వారి చుట్టూ తిరుగుతూ వారితో కలిసి నడవడానికి ఒప్పించుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ వైఖరి వలన భాజపాకు కూడా చేటు జరుగుతుందా అని వారు భయపడుతున్నారు.

రాష్ట్రంలో అమరావతినుంచి రాజధాని తరలిపోతుందని అన్నప్పటినుంచి వ్యతిరేకించిన అన్ని విపక్షాల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. నిజానికి వ్యతిరేకించిన అన్ని పార్టీల్లోకీ అత్యంత తక్కువ మోతాదులో వ్యతిరేకించింది భాజపా మాత్రమే! అదే సమయంలో ఆంధ్రేతర భాజపా నాయకులందరూ కూడా.. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానికి సంబంధించిన విషయం అని విస్పష్టంగా తేల్చి చెబుతూ.. లోకల్ గా ఏపీ భాజపా సాగిస్తున్న పోరాటాలకు  కూడా విలువ లేకుండా చేసేశారు. దానికి తగ్గట్టు తూతూమంత్రంగానే వారి పోరాటాలు సాగాయి.

యిప్పుడు పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేశాడు. జగన్ ను తీవ్రస్థాయిలో తూర్పారపడుతున్నాడు. అమరావతి రైతుల పక్షాన మాట్లాడుతున్నాడు. అమరావతి రైతుల్ని మరీ అతిగా సమర్థిస్తే.. తమ పార్టీకి అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో విలువ తగ్గుతుందనేది భాజపా నాయకుల భయం. అందుకే వారు పైపైనే నిరసనలు చేస్తున్నారు. కానీ.. పవన్ వచ్చాక అమరావతి ప్రాంత రైతుల్ని మరీ నెత్తిన పెట్టుకుంటున్నారు. షూటింగ్, స్టోరీ సిటింగు గ్యాప్ లలో మళ్లీ ఓ టూరు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన ఇక్కడ ఇంత ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది.. తమకు ఇతర ప్రాంతాల్లో చేటు చేస్తుందేమోనని కమల నాయకులు భయపడుతున్నారు. పవన్ తో లాభం ఎంతో తెలియదు గానీ.. ఇప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న తమకు చేటు తప్పదని వారు అనుకుంటున్నారు.

సినిమాలు ఎప్పుడూ మోసం చెయ్యవు మనుషులే