cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

పయ్యావుల కేశవ్ ఎక్కడ?

పయ్యావుల కేశవ్ ఎక్కడ?

పయ్యావుల కేశవ్..ఈ పేరు రాజకీయ రంగంలో బాగానే పాపులర్ కానీ ఈ పేరు పత్రికల్లో కనిపించి, రాజకీయ వర్గాల్లో వినిపించి చాలా కాలం అయింది. ఎందుకిలా? ఏం జరిగి వుంటుంది? నిజానికి పయ్యావుల కేశవ్ మంచి వక్త. తెలుగుదేశం పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని మీడియా ముందు గట్టిగా నిలబడగల మాటకారి. అలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ కి అవసరమైన సమయంలో మౌనంగా వుండిపోయారు? కారణం ఏమై వుంటుంది?

రాజకీయాల్లో అవసరానికి ఆదుకున్నవారికే అవసరం అయినపుడు హ్యాండ్ ఇస్తారు. అలాంటిది అవసరం అయిన వేళ ఆదుకోకుంటే, అవతలి వాళ్లకు అవసరం అయినపుడు ఇలాగే మౌనం వహిస్తారు. విషయం ఏమిటంటే, పయ్యావుల కేశవ్ 2014 ఎన్నికల్లో ఓడిపోయాడు. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. నిజానికి చంద్రబాబు తలుచుకుని వుంటే, పయ్యావులను ఎమ్మెల్సీ చేసి, ఆపై మంత్రిని కూడా చేసి వుండేవారు. కానీ అలా జరగలేదు.

ఇప్పుడు ఓడలు బండ్లు అయ్యాయి. చంద్రబాబు ప్రతిపక్షంలో వున్నారు. పయ్యావుల ఎమ్మెల్యేగా వున్నారు. నిజానికి చంద్రబాబు తరపున గట్టిగా మాట్లాడేవారే కరువయ్యారు. ఇలాంటి టైమ్ లో పయ్యావుల పెద్ద అండగా వుండే పరిస్థితి. కానీ  అలా జరగడం లేదు. గత అయిదేళ్లలో చంద్రబాబు కాస్తయినా పట్టించుకుని వుంటే, ఇప్పుడు పయ్యావుల మైకు ముందుకు వచ్చి వుండేవారు.  బాబు అలా చేసారు. ఇప్పుడు ఈయన ఇలా చేస్తున్నారు. 

అంతేనంటారా? ఇంకేమైనా వుందనుకోవాలా?