Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ ముందు చూపు

జగన్ ముందు చూపు

నేత అన్నవాడు ముందు చూపుతో ఆలోచించాలి. విజన్ వుంది అని చెప్పుకోవడం కాదు. విజన్, విజ్ఞత ప్రదర్శించాలి. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఓ నిర్ణయం నిజంగా ముందు చూపుతో తీసుకున్నదే. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రవేశపెట్టారు. అనేక మంది పేదలకు ఇది వరంగా మారింది. కానీ అదే సమయంలో ప్రయివేటు ఆసుపత్రులు అందినంత దోచుకోవడానికి అనుకూలంగా కూడా మారింది. ఏలినవారి అండదండలు పుష్కలంగా వున్న ఆసుపత్రులు ఏటా కోట్లకు కోట్లు ప్రభుత్వం నుంచి దండుకుంటున్నాయి. 

నిజానికి ఏడాదికి ఆరోగ్య శ్రీ కింద ఓ వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారు అనుకంటే, కనీసం వంద కోట్లు ఖర్చు చేసి ఓ ఆసుపత్రి నిర్మించుకుంటూ వెళ్తే, ఓ పదేళ్లకు జిల్లాలో ప్రత్యేక ఆరోగ్య శ్రీ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరోగ్య శ్రీ పేషెంట్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాకుండా ఈ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించవచ్చు. తద్వారా కార్పొరేట్ దోపిడీని అరికట్టవచ్చు.

ఇప్పుడు ఇదే దిశగా అడుగేస్తున్నారు జగన్. 13 జిల్లాలకు ఒకేసారి 15 వైద్య కళాశాలలను మంజూరు చేసారు. ఇలా మంజూరు చేయడానికి ముందే ఆరోగ్య మంత్రి వెళ్లి స్థలాలు చూసి వచ్చారు. ఇప్పుడు అనుమతులు మంజూరు చేస్తూనే, భవనాల నిర్మాణానికి సంస్థలను కూడా ఎంపిక చేసేసారు. ఓ ఏడాదిలోగా వీటిని ప్రారంభించాలన్నది సిఎమ్ ఆలోచన.

వైద్య కళాశాల అంటే అనుబంధంగా బోధన ఆసుపత్రి కచ్చితంగా వుండాల్సిందే. అంటే 13 జిల్లాలకు 15 బోధన ఆసుపత్రులు నిర్మించాల్సి వుంటుంది. ఇప్పటికే వున్న పెద్ద ఆసుపత్రులకు ఇవి అదనం అవుతాయి. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించే విషయంలో ఇది కచ్చితంగా మంచి ముందు అడుగు అవుతుంది. ఆరోగ్యశ్రీని దీనికి అనుసంధానం చేస్తే మరీ మంచిది అవుతుంది. కార్పొరేట్ ఆసుపత్రుల ఆట కడుతుంది. అలాగే ఏడాదికి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది డాక్టర్లు బయటకు వస్తే, జనాలకు ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తాయి.

అప్ప‌ట్లో శంక‌ర‌రావు...ఇప్పుడు రాఘ‌రామ‌కృష్ణంరాజు

పవన్ కళ్యాణ్ నా గర్ల్ ఫ్రెండుని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?