తన బయోపిక్ తానే తీసుకుంటున్న వర్మ

వర్మపై ప్రస్తుతం చాలా సినిమాలొస్తున్నాయి. అన్నీ అతడ్ని విమర్శించేవే. రాంగో, రోజూ గిల్లే వాడు, పరాన్నజీవి లాంటివన్నీ వర్మపై సెటైరిక్ సినిమాలే. ఇలా రకరకాల వ్యక్తులు, తనపై రకరకాల సినిమాలు తీస్తుంటే.. ఎందుకొచ్చిన గొడవ…

వర్మపై ప్రస్తుతం చాలా సినిమాలొస్తున్నాయి. అన్నీ అతడ్ని విమర్శించేవే. రాంగో, రోజూ గిల్లే వాడు, పరాన్నజీవి లాంటివన్నీ వర్మపై సెటైరిక్ సినిమాలే. ఇలా రకరకాల వ్యక్తులు, తనపై రకరకాల సినిమాలు తీస్తుంటే.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడేమో.. ఏకంగా తన బయోపిక్ ను తానే ఎనౌన్స్ చేశాడు ఆర్జీవీ.

అవును.. రాము పేరిట ఓ కొత్త సినిమా ప్రకటించాడు వర్మ. “ఏ బయోపిక్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ” అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ బయోపిక్ వివరాల్ని ఒక్కొక్కటిగా దశలవారీగా బయటపెడుతూ వస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇది మూడు భాగాలుగా రాబోతోందనే విషయాన్ని ప్రకటించాడు ఆర్జీవీ. అలా అని ఇది వెబ్ సిరీస్ కాదు. ప్రతి భాగం 2 గంటల నిడివితో.. 6 గంటల సినిమాగా ఇది రాబోతోందని క్లియర్ గా శెలవిచ్చాడు.

తన బయోపిక్ ను తానే రాసుకున్నాడు వర్మ. ఈ 3 భాగాల బయోపిక్ కు రచయితను తానేనని, దర్శకత్వ బాధ్యతల్ని మాత్రం దొరసాయి తేజ అనే వ్యక్తికి అప్పగించానని చెప్పుకొచ్చాడు. బొమ్మాకు మురళి నిర్మించే ఈ సినిమాకు తను దర్శకత్వం పర్యవేక్షకుడిగా ఉంటాడట. 

తన జీవితంలో మూడు దశల్లో జరిగిన వివిధ ఘటనల సమాహారంగా రాము ట్రయాలజీ వస్తుందంటున్నాడు వర్మ. మొదటి భాగంలో తన 20 ఏళ్ల నాటి ఘటనల్ని చూపిస్తానని, ఈ పాత్రను ఓ కొత్త నటుడు పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక పార్ట్-2లో మరో డిఫరెంట్ నటుడు నటిస్తాడని.. పార్ట్-3లో మాత్రం తన పాత్రలో తానే కనిపిస్తానని చెప్పుకొచ్చాడు.

రాము పార్ట్-1లో తన కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో పాటు.. శివ సినిమా చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడో చూపిస్తారట. ఇక పార్ట్-2లో అండర్ వరల్డ్ తో ప్రేమాయణం అంటూ ముంబయి జీవితం, బాలీవుడ్ సినిమాలు, అమితాబ్ తో అనుబంధం చూపిస్తారట. పార్ట్-3ను ఇంటెలిజెంట్ ఇడియట్ పేరిట తన ఫెయిల్యూర్స్ ను రాడికల్ ఆలోచనల్ని, దేవుడు-సెక్స్-సమాజంపై తన విపరీత ఆలోచల్ని ఆవిష్కరిస్తాడట.

ఇలా తన బయోపిక్ ను తానే ఎనౌన్స్ చేసి, ఫుల్ డీటెయిల్స్ బయటపెట్టాడు ఈ దర్శకుడు.అన్నట్టు రాము అనే టైటిల్ లోనే ఈ దర్శకుడు స్త్రీలోలుడు, సైకో, తాగుబోతు లాంటి పదాల్ని వాడుకున్నాడు.

అప్ప‌ట్లో శంక‌ర‌రావు…ఇప్పుడు రాఘ‌రామ‌కృష్ణంరాజు