చేత‌గాని త‌నాన్ని ఢిల్లీలో ఒప్పుకున్న ప‌వ‌న్?

ఏపీ ప్ర‌భుత్వంపై ఢిల్లీకి కంప్లైంట్లు ఎత్తుకెళ్లి.. చిన్న‌పిల్లాడిలా అక్క‌డ కంప్లైంట్ చేసిన‌ట్టుగా ఉన్నారు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్. నోరెత్తితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడే మాట‌ల‌కూ.. ఆయ‌న తీరుకూ ఏ మాత్రం సంబంధం మాత్రం…

ఏపీ ప్ర‌భుత్వంపై ఢిల్లీకి కంప్లైంట్లు ఎత్తుకెళ్లి.. చిన్న‌పిల్లాడిలా అక్క‌డ కంప్లైంట్ చేసిన‌ట్టుగా ఉన్నారు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్. నోరెత్తితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడే మాట‌ల‌కూ.. ఆయ‌న తీరుకూ ఏ మాత్రం సంబంధం మాత్రం ఉండ‌దు.  త‌ను ఏం చేయ‌లేను అన్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లూ చేస్తూ ఉన్నారు ఈ మ‌ధ్య‌. అక్క‌డ కూడా ప‌రిస్థితులు అంత అనుకూలంగా ఉన్న‌ట్టుగా లేవు.

రెండు రోజులు గ‌డిస్తే కానీ.. అక్క‌డ ఒక బీజేపీ నేత అపాయింట్ మెంట్ ద‌క్కిన‌ట్టుగా లేదు. అక్క‌డ‌కూ అమిత్ షా, మోడీల అపాయింట్ మెంట్ లేదాయె! అయితే ప‌వ‌న్ ఈ సారి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌తో ఒకటి సాధించార‌ట‌. అదేమిటంటే.. ఇక నుంచి జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ప‌ని చేస్తాయ‌ట‌! ఇంత‌కీ  క‌లిసి ప‌ని చేయ‌డం ఏమిటో.. ఇక ముందు ముందు చూడాల్సి ఉంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ చేసిన ఫిర్యాదులు అన్నీ వినీ.. తాము అన్నీ గ‌మ‌నిస్తున్న‌ట్టుగా చెప్పార‌ట బీజేపీ నేత న‌డ్డా! వెనుక‌టికి కాంగ్రెస్ వాళ్లు త‌మ అధిష్టానం అంటూ ఢిల్లీకి కంప్లైంట్లను ఎత్తుకెళ్లే వారు. వివిధ అంశాల గురించి ముఖ్య‌మంత్రిపై ఫిర్యాదు చేసే వాళ్లు. కాంగ్రెస్ వాళ్లు అంటే.. అధిష్టానానికి దాసులు. అధిష్టానం మీదే వారి రాజ‌కీయం ఆధార‌ప‌డి ఉండేది.

అలాంటి కాంగ్రెస్ వాళ్ల‌ను , అలా ఢిల్లీ చుట్టూ తిరిగే వారి సంస్కృతిని ప‌వ‌న్  క‌ల్యాణ్ ఎంత‌గానో విమ‌ర్శించారు. ఇప్పుడు ఆయ‌న ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. త‌న‌కు లేని అధిష్టానాన్ని ఒక‌టి అక్క‌డ సృష్టించుకుని.. దానికి కంప్లైట్లు ఇచ్చి.. త‌న చేత‌గాని త‌నాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చాటుకుంటూ ఉన్నాడు. దీనికి క‌ల‌సి ప‌ని చేయ‌డం అనే అంద‌మైన పేరొక‌టి పెట్టారు. ఇంత‌కీ ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీకి వ‌చ్చిన ఓట్ల శాతం ఎంత‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ‌చ్చిన ఓట్ల శాతం ఎంత‌.. రెండూ క‌లిపితే ఎంతోమ‌రి!