Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రియాంక: ఇదే స్పీడుతో వచ్చే ఎన్నికల్లోకి!

ప్రియాంక: ఇదే స్పీడుతో వచ్చే ఎన్నికల్లోకి!

కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వ బాధ్యతలు వహించడానికి వేరే దిక్కుమొక్కూ లేకుండాపోతున్న తరుణంలో సోనియా కుటుంబం నుంచే మరొకరు తయారవుతున్నారు. ఇన్నాళ్లపాటు రాజకీయంగా ఆఫ్ లైన్ లో మాత్రమే ఉండిపోయి.. ఏదో ఎన్నికల సమయంలో అంతో ఇంతో ప్రచారం మాత్రం చేసిపెడుతూ పార్టీ అవసరాలకు ఉపయోగపడుతున్న ప్రియాంక వాద్రా.. ఇప్పుడు ఒక రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఇన్చార్జిగా పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అది కూడా దేశంలో అతి పెద్దదైన రాష్ట్రానికి.

ప్రియాంక వాద్రా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి పార్టీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఆమెను మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇన్చార్జిగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం  పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రాజ్ బబ్బర్ పనితీరు పట్ల అధినాయకత్వం అసంతృప్తి గా ఉండడంతో, ఆయన స్థానంలో అధ్యక్ష పగ్గాలు ప్రియాంక చేతిలో పెట్టబోతున్నారు. సోనియాగాంధీ ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండగా దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ఆమె కూతురు ప్రియాంక అధ్యక్షురాలు కాబోతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఆల్ టైం బ్యాడ్ ఫలితాలను సాధించింది. ఉన్న ఒకే ఒక్కచోట గెలుపొందింది. అది కూడా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ మాత్రమే. రాహుల్ బరిలోకి దిగిన ఆమేథీ నియోజకవర్గంలో ఆయన కూడా ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 2022 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధంచేయడం కాంగ్రెస్ అధినాయకత్వానికి కత్తి మీద సాములా మారింది. అందుకే ప్రియాంక రంగంలోకి తీసుకువచ్చి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

మొత్తం యు పిసిసి కార్యవర్గాన్ని కూడా ప్రక్షాళన చేయబోతున్నారు. అంతా 40 ఏళ్లకు మించని వారిని మాత్రమే కార్యవర్గంలోకి తీసుకుంటామని చెబుతున్నారు. పార్టీకి యువ రక్తం ఎక్కిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నాయకత్వం ఆశించడంలో తప్పులేదు. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతానికే ఇన్చార్జిగా లోక్సభ ఎన్నికలలో పని చేసిన ప్రియాంక, కనీసం ఫలితాలను కూడా రాబట్టలేకపోయిన సంగతి మర్చిపోకూడదు. పార్టీ పరాభవం తరువాత ఆమె కార్యకర్తలను దారుణంగా నిందించారు. ఇవన్నీ గుర్తుంచుకుని అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది. 

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?