Advertisement

Advertisement


Home > Politics - Gossip

పివిపి సాధించలేనిది..

పివిపి సాధించలేనిది..

టీవీ 9ను కొనాలని, మీడియా రంగంలోకి ఆ దారిలో ప్రవేశించాలని పారిశ్రామిక వేత్త, సినిమా నిర్మాత పివిపి అలియాస్ పొట్లూరు వీరప్రసాద్ చాలా ప్రయత్నించారు. వాస్తవానికి మైహోమ్ రామేశ్వరరావు రంగంలోకి దిగడానికి కొద్దిరోజులు ముందుగా పివిపి రంగంలోకి దిగారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలతో దాదాపు రెండు మూడునెలలు కిందామీదా పడ్డారు. అన్నీ రెడీ చేసుకున్నారు.

కానీ ఆ డీల్ సెట్ కాకుండా రవిప్రకాష్ అడ్డంపడ్డారని టాక్. అప్పటికి ఎన్నికలు కాస్త దూరంలో వున్నాయి. ఈ టైమ్ లో పివిపి చేతిలోకి టీవీ 9 వెళ్తే అది వైకాపాకు అనుకూలంగా మారుతుందన్న భయంతో రవి ప్రకాష్ చాలా విధాల పివిపికి అడ్డంపడ్డారని అప్పట్లో ఇన్ సైడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

అయినా మొండిగా పివిపి చాలా గట్టిగా ప్రయత్నించి, ఆఖరికి విసిగి వదిలేసారు. ఇప్పుడు మైహోమ్ రామేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా మైనారిటీ స్టేక్ హోల్డర్ అయిన రవిప్రకాష్ ఎంతకూ మేనేజ్ మెంట్ నుంచి తప్పుకొకపోవడంతో బలవంతంగా తప్పించారు.

ఈ ఉదంతం అంతాచూసి, తాను సాధించలేకపోయినది మైహోమ్ రామేశ్వరరావు సాధించారని పివిపి తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తను ఎంతో ప్రయత్నించానని, కానీ అనేక అవరోథాలు సృష్టించి, మీటింగ్ లు జరగకుండా చేసి, ఆఖరికి తనను పక్కకు తప్పుకునేలా చేసారని ఆయన సన్నిహితుల దగ్గర కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?