cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హ్యాట్రిక్ కొట్టిన వెంకీ

హ్యాట్రిక్ కొట్టిన వెంకీ

విక్టరీ వెంకటేష్ హ్యాట్రిక్ కొట్టారు. ఎఫ్ 2 తరువాత సినిమానే విడుదల కాలేదు ఇంకా, హ్యాట్రిక్ వ్యవహారం ఏమిటి అని అనుకోవద్దు. వెంకీ హ్యాట్రిక్ కొట్టింది ఆయన సినిమాలతో కాదు. వేరే వాళ్ల సినిమాలతో. వెంకీ చీఫ్ గెస్ట్ గా మేనల్లుడు నాగచైతన్య నటించిన మజిలీ సినిమా ఫంక్షన్ జరిగింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. బయ్యర్లకు నిర్మాతకు భారీగా లాభాలు వచ్చాయి.

ఆ తరువాత వెంకీ ఛీఫ్ గెస్ట్ గా నాని జెర్సీ సినిమా ఫంక్షన్ జరిగింది. ఆ సినిమాకు విపరీతమైన అప్లాజ్ వచ్చింది. బయ్యర్లు కూడా గట్టెక్కేసారు. మంచి సినిమా అయినందుకు నిర్మాత హ్యాపీ. మొన్నటికి మొన్న మహర్షి సినిమాకు గెస్ట్ గా వచ్చారు వెంకీ. ఆ సినిమా కూడా డొమస్టిక్ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫేర్ చేస్తోంది.

ఫస్ట్ వీకెండ్ అంతా కలిపి డొమస్టిక్ మార్కెట్ లోనే 45 కోట్ల నుంచి 50 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఆ విధంగా వెంకీ హ్యాట్రిక్ కొట్టినట్లే. కానీ సమస్య ఒకటే, ఇక సిన్మా జనాలు అందరూ తమ ఫంక్షన్ లకు రమ్మని వెంకీ వెనుక పడతారేమో?

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!