Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య 'రూలర్'

బాలయ్య 'రూలర్'

బాలయ్య-కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు చాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేసారు. ప్రస్తుతం సి.కళ్యాణ్ చేస్తున్న సినిమా బాలయ్యదే. పైగా టైటిల్ కూడా ఫవర్ ఫుల్ గా వుంది. అందువల్ల ఈ టైటిల్ బాలయ్య కోసమే అని అనుకోవాల్సి వస్తోంది.

కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. జైసింహా సినిమాలో బాలయ్య సరసన నటించిన హరిప్రియ ఈ సినిమాలో కూడా జోడీ కడుతుందని వార్తలు వున్నాయి. జగపతి బాబు విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు సిరీస్ తరువాత బాలయ్య చేస్తున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇది.

బోయపాటి శ్రీనివాస్ సినిమా చేస్తారని వార్తలు వినవచ్చిన నేఫథ్యంలో సడెన్ గా ఈ సబ్జెక్ట్ ను ఎంచుకుని, సెట్ మీదకు వెళ్తున్నారు బాలకృష్ణ. వీలయినంత త్వరగా ఫినిష్ చేసి, ఈ ఏడాదే విడుదల చేయాలన్న సంకల్పంతో వున్నారు. దీని తరువాత బోయపాటి సినిమా చేసే అవకాశం వుంది.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?