Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బలుపు' కలిపింది ఇద్దరినీ

'బలుపు' కలిపింది ఇద్దరినీ

బలుపు సినిమా డైరక్టర్ గోపీచంద్ మలినేనికి, హీరో రవితేజకు కూడా ఓ హిట్ జ్ఞాపకం. కట్ చేస్తే, ప్రస్తుతం సరైన హిట్ స్క్రిప్ట్ కోసం రవితేజ, హిట్ చాన్స్ కోసం గోపీచంద్ మలినేని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిని ఓ స్క్రిప్ట్ కలిపింది. గోపీచంద్ మలినేని చెప్పిన అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ విని, ఇది కదా నాకు కావాల్సింది అంటూ ఓకె చేసేసాడట రవితేజ.

ప్రస్తుతం చేస్తున్న డిస్కోరాజా (ఈ సినిమా లేదు, రాదు అని బోలెడు గ్యాసిప్ లు వున్నాయి. అవన్నీ పక్కా గ్యాసిప్ లే, సినిమా సెట్ మీదకు త్వరలో వెళ్తోంది) తరువాత ప్రాజెక్ట్ గా గోపీచంద్ మలినేని సినిమాను ఫైనల్ చేసాడట రవితేజ.

దాదాపు ఏడాది కాలంగా ఒకే స్క్రిప్ట్ ను ఫైన్ ట్యూన్ చేస్తూ వచ్చిన గోపీచంద్ మలినేని, హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, కాస్టింగ్ పైన దృష్టి పెట్టి, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారట. కాంచన 3తో తెలుగులో, అయోగ్యతో తమిళంలో రెండు హిట్ లు కొట్టిన టాగోర్ మధు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఆయన తన లైట్ హౌస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తారు.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?