Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ కథ చెప్పనున్న సమంత

నాగ్ కథ చెప్పనున్న సమంత

మన్మధుడు, నాగ్ కెరీర్ లోనే ది బెస్ట్ క్లాసిక్ ఫన్ జోనర్ సినిమా అని అనుకోవాలి. గ్లామర్, కథ, మాటలు, ఫన్, మ్యూజిక్ అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా అది. ఆ సినిమాకు సీక్వెల్ అనేటట్లుగా రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు నాగార్జున ఇప్పుడు. వాస్తవానికి ఇది ఓ విదేశీ సినిమా. దాని హక్కులు కొని రీమేక్ చేస్తున్నారని టాక్.

అయితే ఈ సినిమా మన్మధుడు సినిమాకు రివర్స్ అన్నట్లు వుంటుదట. సినిమాలో మొదటి నుంచి ఆఫీస్ బాస్ నాగ్ అమ్మాయిలతో అచ్చట్లు ముచ్చట్లు పెడతూ, వాళ్లకు హెల్పింగ్ గా వుంటాడట. అంటే మన్మధుడు వన్ లో పాత్రకు పక్కా రివర్స్ అన్నమాట. అయితే ఆ సినిమాలో అమ్మాయిలు అంటే చిర్రుబుర్రులాడే నాగ్ అలా ఎందుకు మారాడు అన్నది బాబాయ్ తనికెళ్ల నోటి వెంట చెప్పిస్తాడు దర్శకుడు.

ఈ సినిమాలో కూడా అమ్మాయిలతోనే నాగ్ అలా అంత కలివిడిగా ఎందుకు వుంటాడు. వుంటున్నాడు అనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను సమంత చేత చెప్పిస్తున్నాడంట రాహుల్ రవీంద్రన్. సమంత రోల్ ఈ సినిమాలో జస్ట్ గెస్ట్ రోల్ అన్నమాట. జస్ట్ రెండు రోజుల కాల్ షీట్ మాత్రమే నంట. ప్రస్తుతానికి ఈ సినిమా విశేషాలు ఇంతే. మరిన్ని త్వరలో.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?