మహేష్‌కి మంచి కామెడీ టైమింగ్ వున్నా కానీ పోకిరి, దూకుడు లాంటి చిత్రాల కంటే సీరియస్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నాడు. ఇటీవల చేసిన సినిమాల్లో శ్రీమంతుడు, భరత్ అనే నేను మాత్రమే విజయవంతం కావడంతో ప్రేక్షకులు తనని అలాగే చూడాలని అనుకుంటున్నారని భావిస్తున్నట్టున్నాడు. బ్రహ్మూెత్సవం, స్పైడర్ లాంటి ఎదురు దెబ్బలతో మహేష్ బాగా డిఫెన్స్‌లో పడిపోయాడు.
దీంతో తనకి సీరియస్ తరహా పాత్రలు బెస్ట్ అని ఫిక్స్ అయిపోయి మరోసారి శ్రీమంతుడు మోడ్‌లో మహర్షి చేసాడు. భరత్ అనే నేనులోనే శ్రీమంతుడి ఛాయలు ఎక్కువ వున్నాయనే కంప్లయింట్ వచ్చింది. మహర్షి ఆ రెండు చిత్రాలకీ మిక్స్ అనిపించడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. వంద కోట్లకి పైగా థియేటర్లనుంచి రాబట్టాల్సిన ఈ చిత్రానికి ఓపెనింగ్ బాగా వచ్చింది కానీ ఈ టాక్‌తో సస్టెయిన్ అవగలదనేది అనుమానమే.
మహేష్ ఇక సీరియస్ పాత్రలు మానేసి మరోసారి పోకిరి మోడ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెట్టింది పేరయిన అనిల్ రావిపూడితో మలి చిత్రం కనుక మహేష్ నుంచి కోరుకుంటోన్న ఛేంజ్ ఆ సినిమాలోనే చూడవచ్చునేమో వేచి చూడాలి.