కాల్ చేస్తే చాలు… కరోనా పలకరిస్తుంది!

కరోనా వైరస్ యావత్ దేశాన్ని ఏ స్థాయిలో ఆందోళనకు గురిచేస్తున్నదో అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా ప్రజలు కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ టీవీ లో చూసినా కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఉపయోగపడే…

కరోనా వైరస్ యావత్ దేశాన్ని ఏ స్థాయిలో ఆందోళనకు గురిచేస్తున్నదో అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా ప్రజలు కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ టీవీ లో చూసినా కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఉపయోగపడే చర్చా కార్యక్రమాలే నడుస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం కరోనా మీద జోకులు పేలుతున్నాయి. కరోనాకు ఇదీ మందు అంటూ అనేకానేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. కరోనా ఎదుర్కోవడం గురించి.. ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాల్సిన అవసరం మాత్రం ఉంది. అందుకే ఇప్పుడు మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు కూడా ఈ ప్రయత్నంలో భాగం అయినట్లుగా కనిపిస్తోంది.

ఎవరు ఏ మొబైల్ నుంచి కాల్ చేసినా.. వారిని ముందుగా  ‘కరోనా’ పలకరిస్తుంది. ముందుగా ఒక పొడి దగ్గు… వినిపిస్తుంది. అదేంట్రా మనం కాల్ చేసిన తర్వాత కనీసం రింగ్ చప్పుడు కూడా రాకముందే.. అవతలి వ్యక్తి ఫోను ఆన్సర్ చేశాడని అనిపించకముందే… దగ్గు వినిపిస్తోందే.. అని ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా.. ఫోనులో ఆ దగ్గు ఆగుతుంది. ఆ వెంటనే కరోనా గురించిన హెచ్చరికలు మొదలవుతాయి. కరోనా వైరస్ ఎలా ప్రబలుతోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దగ్గు లేదా తుమ్ము తరచూ వస్తున్న వ్యక్తులనుంచి కాస్త దూరంగా మెలగాలని, మాస్క్ లు ధరించాలని, ఇతరులతో కనీసం మీటరు దూరంగా ఉండాలని ఇలా అనేక రకాల జాగ్రత్తలు వివరించిన తర్వాతే… మనకు రింగ్ మొదలవుతుంది. అంటే ఎవ్వరు కాల్ చేసినా సరే.. ముందుగా కరోనా హెచ్చరికలే పలకరిస్తాయన్నమాట.

కరోనా వైరస్ గురించి చైతన్యం ప్రజల్లో పూర్తిగా కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న అనేక చర్యల్లో ఇది కూడా ఒకటి అనుకోవాలి. కరోనా ప్రభావం సమాజం మీద పెద్దఎత్తున కనిపిస్తోంది. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తే.. దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. రోడ్లమీద కూడా రద్దీ తగ్గుతోంది. కొన్ని ప్రెవేటు కార్యాలయాలు అనధికారికంగా సెలవులు ఇచ్చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్నవారంతా.. ఆ పని ఎప్పటినుంచో ప్రారంభించేశారు.

ప్రజలు విమాన ప్రయాణాలను చాలావరకు తగ్గించుకుంటున్నారు. ఏసీ బోగీల్లో ప్రయాణాలు కూడా తగ్గుతున్నాయి. మొత్తానికి కరోనా మొత్తం దేశాన్నీ విపరీతంగా వణికిస్తోంది.

రామ్ చరణ్ నా ప్రాణస్నేహితుడు

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా స్టోరీ ఇదే