cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

రజనీ అవుట్ వార్తలు నిజమా? కాదా?

రజనీ అవుట్ వార్తలు నిజమా? కాదా?

టీవీ 9 రవిప్రకాష్ వేరు రజనీకాంత్ వేరు అని ఎవ్వరూ అనుకోరు. ఆ ఛానెల్ చేతులు మారేవరకు కూడా ఆ ఇద్దరు ఆత్మ-పరమాత్మ టైపులో కలిసే ఆలోచించారు. కలిసే పని చేసారు.

టీవీ 9 చేతిలోకి వస్తున్న సమయంలో వైఎస్ జగన్ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినపుడు కూడా రజనీ తన మార్కు లోనే చేయాలని చూసారు తప్ప, ఛానెల్ కు అనుగుణంగా వెళ్లలేదు. కానీ అలాంటిది రాను రాను ఆయన ఛానెల్ అధినేతల పాలసీకి అనుగుణంగా మారుతూ వచ్చారు. కానీ ఇది ఫలితం ఇవ్వలేదు.

టీవీ 9 నుంచి రజనీ కాంత్ ఇప్పుడు బయటకు నిష్క్రమిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చేసాయి . మేనేజ్ మెంట్ మాత్రం ఈ వార్తలను ధృవీకరించడం లేదు. ఆయన తమ సంస్థలోనే వున్నారని చెబుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే రజనీకాంత్ సన్నిహిత వర్గాలు మాత్రం ఆయనను బయటకు పంపేయడానికి టీవీ 9 లో వున్న మరో జర్నలిస్ట్  మురళీకృష్ణను ముందుకు నడిపి, రజనీకాంత్ కు పొగపెడుతున్నారని అంటున్నారు.

నిప్పు లేనిదే పొగరాదు కానీ, నివురు కప్పిన ఆ నిప్పు ఎప్పుడు తళుక్కుమంటుందో, నుసిబారిపోతుందో చూడాలి. 

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా 

వ్యవస్థను కాపాడాల్సిన కోర్టే ఇలా చేస్తే