విశాఖపై బాబు కుట్ర బయటపెట్టిన వాసుపల్లి?

వైసీపీకి బాహాటంగా మద్దతు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ అధినేత చంద్రబాబుపై చండ్రనిప్పులే కురిపిస్తున్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని, కుట్రలను ఆయన బట్టబయలు చేస్తున్నారు. Advertisement అయిదేళ్ళ క్రితం చంద్రబాబు…

వైసీపీకి బాహాటంగా మద్దతు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ అధినేత చంద్రబాబుపై చండ్రనిప్పులే కురిపిస్తున్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని, కుట్రలను ఆయన బట్టబయలు చేస్తున్నారు.

అయిదేళ్ళ క్రితం చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు  ఒక సర్వే చేసి గుంటూరులోనే రాజధాని ఉండాలని అత్యధిక జనం కోరుతున్నారని లోకాన్ని నమ్మించారు. అయితే అదంతా ట్రాష్ అంటున్నారు వాసుపల్లి. నాడు విశాఖ రాజధాని కావాలని కోరుతూ పెద్ద ఎత్తున జనాలు ఓటు చేశారని అసలు గుట్టు విప్పారు.

అయితే ముందే అమరావతి రాజధాని ప్లాన్ రెడీ చేసుకున్న చంద్రబాబు తూతూ మంత్రంగా సర్వే చేసినట్లుగా చూపించి మద్దతు అంతా గుంటూరు వైపే ఉందని అటు పార్టీని, ఇటు జనాన్ని మభ్యపెట్టారట. నిజానికి క్రిష్ణ గుంటూరు జనాల ఓట్లు రెండూ కలిపేసి విశాఖ కంటే అమరావతికే ఎక్కువ  జనం మద్దతు ఉందని బాబు కుట్రపూరితంగా చేశారని వాసుపల్లి ఆరోపిస్తున్నారు.

ఆనాడు తాను పార్టీ వేదికల మీద ఈ విషయం ప్రస్తావించి హై కమాండ్ నుంచి తిట్లు కూడా తిన్నానని ఆయన నాటి సంగతులు చెప్పుకున్నారు. ఏపీలో నంబర్ వన్ రాజధానిగా ఎదిగ అర్హత విశాఖకే ఉందని కూడా వాసుపల్లి అంటున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే ఉంటుందని కూడా అయన ఎత్తిపొడుతున్నారు. తాను మనసు చంపుకుని గత పదహారు నెలలు టీడీపీలో ఉన్నానని కూడా ఆయన పెద్ద బాంబే పేల్చారు.

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా