Advertisement

Advertisement


Home > Politics - Gossip

రత్నప్రభ ఏ పార్టీ అభ్యర్థి?

రత్నప్రభ ఏ పార్టీ అభ్యర్థి?

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల బరిలోక మాజీ ఐఎఎస్ రత్నప్రభ దిగుతారని ఇప్పటికే బోలెడు వార్తలు వచ్చాయి. జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థిగా అమెను ప్రతిపాదిస్తున్నారని ఆ వార్తల సారాశం. అయితే ఈ పేరు భాజపా ప్రతిపాదించిందా? జనసేన ప్రతిపాదించిందా? అన్నది మాత్రం క్లారిటీ లేదు.

జనసేనే ప్రతిపాదించిందని, కానీ భాజపానే అఫీషియల్ గా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తుందని రాజకీయ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. ఆ విధంగా పవన్ సూచించిన అభ్యర్థికి భాజపా టికెట్ ఇచ్చినట్లు అవుతుంది. పైగా ఇరు పార్టీలకు చెందని వ్యక్తి కాబట్టి, సీటు ఎవరకి కేటాయింపు జరిగింది అన్న పట్టింపు వుండదు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా వుందని ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రత్నప్రభ పేరును చంద్రబాబే తెరవెనుక నుంచి పవన్ ద్వారా భాజపాకు సూచించారని చిన్న వదంతి వినిపిస్తోంది. రత్నప్రభ ప్రతిభావంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు.

అలాగే ఆమె భర్త విద్యాసాగర్ కూడా మంచి ఆలోచనలు వున్న ఐఎఎస్ అధికారి. అదే విధంగా రత్నప్రభ కుటుంబ సభ్యులు, బంధువులు చాలా మంది ఐఎఎస్ అధికారులే.

అయితే ఇంతకీ వినిపిస్తున్న ట్విస్ట్ ఏమిటంటే రత్నప్రభ పేరు పవన్ కు సూచించింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ ద్వారా ఈ పేరును భాజపా లోకి వెళ్లేలా చేసింది ఆయనే అని ఆ గుసగుసల సారాశం.

లాస్ట్ మినిట్ లో అవకాశం వుంటే రత్నప్రభలాంటి మంచి పేరున్న అధికారి బరిలో వున్నారు కనుక తాము మద్దతు ఇస్తూ తప్పుకుంటున్నాం అనేందుకు ఓ ఆప్షన్ వుంచుకుంటున్నారని,  ఆ విధంగా జగన్ కు చెక్ చెప్పడం, భాజపాకు దగ్గర కావడం వంటి వ్యవహారాలు దాని వెనుక వున్నాయని టాక్.

చంద్రబాబు ఎందుకు తప్పుకుంటారు? అంటే పనబాక లక్ష్మి ఇంకా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ముక్కోణపు పోటీ అంటే ఎలా వుంటుందో తెలియదు. పైగా పొరపాటున మూడో స్థానంలోకి వెళ్లి దారుణమైన నామర్దా.

వీటన్నింటి బదులు ఇలాంటి ట్విస్ట్ తో తప్పుకుంటే అది వేరుగా వుంటుంది. పైగా పవన్ ద్వారా తాను అనుకున్న పేరును భాజపాలోకి పంపితే, భవిష్యత్ లో తనకు అనుకూలంగా వుండే అవకాశం వుంది. ఇలాంటివి అన్నీ ఆలోచించి బాబుగారు పవన్ తో కలిసి ఈ ఎత్తుగడ వేసారని రాజకీయ వేగుల సమాచారం. 

రాజకీయాల్లో ఏదీ నమ్మడానికీ లేదు. అలాగే నమ్మకపోవడానికి లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.

థియేటర్లకు ఇంకా కష్టం

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?