Advertisement

Advertisement


Home > Politics - Gossip

పాతికేళ్ల ప్రణాళిక సరే.. పాతిక మందైనా మిగులుతారా?

పాతికేళ్ల ప్రణాళిక సరే.. పాతిక మందైనా మిగులుతారా?

"సీట్లు కాదు, ఓట్లు వచ్చాయి చాలు. పాతికేళ్ల ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. నాతో ఉండేవారికి ఓపిక ఉండాలి". ఇలాంటి డైలాగులు వినీ వినీ విసుగెత్తిపోతున్నారు జనసేన నేతలు. అసలు పాతికేళ్ల తర్వాత ఉండేదెవరు, పోయేదెవరు. పాతికేళ్లకు అధికారం వస్తుందనుకుంటే ఇప్పుడు పోటీచేసిన వారి పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకుని ఆస్తుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని వదులుకుని వస్తే.. నువ్విచ్చే సలహా ఇదా అంటూ పవన్ కల్యాణ్ ని తిట్టిపోస్తున్నారు జనసేన నాయకులు.

అంతర్గత సమీక్షలు, పార్టీ మీటింగుల్లో పవన్ తో కాస్త ధైర్యంగానే మాట్లాడుతున్నారట అభ్యర్థులు. ఇటీవల నెల్లూరుజిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు పవన్ కల్యాణ్ ని కలిశారు. కావలి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన పసుపులేటి సుధాకర్ ప్రచారం చివరిరోజుల్లో కావలి వస్తానని చెప్పి మాటతప్పారని పవన్ ని అక్కడికక్కడే నిలదీశారట.

దీంతో కోపగించుకున్న పవన్.. అవకాశం ఉంటే వచ్చేవాడిని కదా.. అయినా సహనం ఉండాలి, పాతికేళ్ల ప్రస్థానం మనది అంటూ క్లాస్ తీసుకున్నారట. అయినా సుధాకర్ వినిపించుకోకుండా.. పాతికేళ్లకు ఎవరు ఎక్కడుంటారో.. అలాంటి రాజకీయాలు మేము చేయలేమంటూ విసురుగా బైటకు వచ్చేశారని సమాచారం.

పవన్ మాటలు నమ్మి వ్యాపారాలు, ఉద్యోగాలను వదిలేసుకుని వచ్చి... కోట్లు ఖర్చుపెట్టి, చివరకు ఫలితాలు వచ్చేలోపే కాడె పడేసిన జనసేనానిని చూసి సుధాకర్ టైపులోనే చాలామంది అభ్యర్థులు విసుక్కుంటున్నారు. టీడీపీతో కుమ్మక్కయ్యారంటూ కొంతమంది చెబుతున్నా నమ్మకుండా జనసేన తరపున పోటీచేశామని, చివరకు అందర్నీ పవన్ నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తున్నారు.

జనసేన పార్టీ పోటీచేసిన స్థానాలు, అక్కడ అభ్యర్థుల సామాజిక వర్గాలు లెక్కలు తీస్తే.. కేవలం వైసీపీ ఓటు బ్యాంక్ కు గాలం వేసేందుకే జనసేన బరిలోకి దిగిందని అర్థమవుతుంది. ఈ నిజానిజాలు తెలిసిన తర్వాతే జనసైనికులకు భ్రమలు వీడుతున్నాయి. ఒక్కొక్కరే పార్టీకి, పవన్ కు టాటా చెప్పేస్తున్నారు. పాతికేళ్లు.. పాతికేళ్లు అంటున్న పవన్ వెంట చివరకు పాతికమంది కూడా మిగలరేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?