హీరో నితిన్ సినిమా స్టార్ట్ చేసి కాస్త గట్టి గ్యాప్ నే వచ్చింది. లై, ఛల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం, మూడు ఫ్లాపులు. శ్రీనివాస కళ్యాణం విడుదలై 10 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడో ఏడాది క్రితం ఓకె చేసిన ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ భీష్మ అలాగే వుంది. ప్రతినెల ఇదిగో షూటింగ్ అంటున్నారు. లేటెస్ట్ గా జూన్ 5 నుంచి అని టాక్. సూర్యప్రతాప్ డైరక్షన్ లో సినిమా క్యాన్సిల్ అయింది.
ప్రెజెంట్ సినేరియా ఏమిటంటే, నితిన్ కు కాస్త పెద్ద డైరక్టర్లు కావాలంట. ఎవరైనా సరే పెద్ద డైరక్టర్లను పట్టుకువస్తే, డేట్ లు ఇవ్వడమే కాదు, మాంచి ఆఫర్లు కూడా ఇస్తారని తెలుస్తోంది. రెమ్యూనిరేషన్ అక్కరలేదు. దానికి బదులు నైజాం రైట్స్ తీసుకుంటారు. కాస్త పెట్టుబడి సాయం కూడా చేస్తారు. కానీ కండిషన్ మాత్రం గౌతమ్ మీనన్, బోయపాటి శ్రీనివాస్ ఇలా కాస్త లీజర్ గా వున్న పెద్ద డైరక్టర్ ఎవరన్నా కావాలంట.
చిన్న, మీడియం డైరక్టర్లతో చేస్తే సినిమాకు బజ్ తీసుకువచ్చేంత కాంబినేషన్లుగా వుండవు. బ్యానర్, డైరక్టర్ కలిస్తేనే నితిన్ కు మంచి ప్యాడింగ్ అవుతుంది. అందుకే ఈ తాపత్రయం అంతా అని తెలుస్తోంది. మరి ఏ డైరక్టర్ ను ఏ నిర్మాత తీసుకువస్తారో చూడాలి.